వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతలేదు! రేవంత్ కోసం రూ. వందకోట్లా?: దమ్ముంటే అంటూ రవీందర్ రెడ్డి సవాల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/కొడంగల్: దమ్ముంటే ఈసారి తనపై గెలవాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి రెండుసార్లు ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గెలిచారని అన్నారు.

<strong>బాబు వల్ల తెలంగాణకు రోజుకు రూ.కోటి నష్టం: వివరించిన హరీశ్, ఈ ప్రశ్నలకు సమాధానముందా?</strong>బాబు వల్ల తెలంగాణకు రోజుకు రూ.కోటి నష్టం: వివరించిన హరీశ్, ఈ ప్రశ్నలకు సమాధానముందా?

టీఆర్ఎస్ పథకాలే గెలిపిస్తాయి

టీఆర్ఎస్ పథకాలే గెలిపిస్తాయి

రేవంత్ రెడ్డిని ఓడించేందుకు రూ. వందకోట్ల ఒప్పందం కుదిరిందంటూ చేస్తున్న ప్రచారం హాస్యాస్పదమని పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అన్నారు.

ప్రజల నుంచి మంచి స్పందన

ప్రజల నుంచి మంచి స్పందన

అభివృద్ధి పథకాలపై ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోదని, అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రూపంలో మేలు జరిగిందని నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ దీపావళి నాటికి మిషన్ భగీరథ ఫలాలు అన్ని గ్రామాలకు అందుతాయన్నారు. రాబోయే రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని నరేందర్ రెడ్డి వివరించారు.

దమ్ముంటే గెలవాలి..

దమ్ముంటే గెలవాలి..

కొడంగల్‌లో మిషన్ భగీరథ ఆలస్యానికి రేవంత్ రెడ్డి తీరే కారణమని విమర్శించారు. నియోజకవర్గంలో నాపరాయి పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. దమ్ము, ధైర్యముంటే రేవంత్ రెడ్డి తనపై ఈసారి గెలవాలని నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు.

రేవంత్‌కు వందకోట్లు అవసరమా?

రేవంత్‌కు వందకోట్లు అవసరమా?

రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదన్నారు.
రేవంత్ రెడ్డిని ఓడించేందుకు రూ. వందకోట్ల ఒప్పందం కుదిరిందంటూ చేస్తున్న ప్రచారం హాస్యాస్పదమన్న నరేందర్ రెడ్డి.. రేవంత్ రెడ్డిని పట్టించుకునేంత సీన్ లేదని, 100కోట్లు కాదు.. లక్ష రూపాయలు కూడా ఆయన కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి భారీగా నిధులు కేటాయించారన్నారు.

English summary
TRS MLA candidate Patnam Narender reddy challenges Revanth Reddy in Kodangal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X