• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జనసేనానికి అడుగడుగునా కష్టాలే.. రోజుకో దుష్ప్రచారం తిప్పికొట్టలేక సతమతం అవుతున్న జనసైన్యం

|

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో మార్పు కోసం స్థాపించిన పార్టీ అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పార్టీ పెట్టిన నాటి నుండి జనసేన మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టటం జనసైన్యానికి సరిపోతుంది. తాజాగా కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వెళ్తున్నాడని జరుగుతున్న ప్రచారం పార్టీ శ్రేణులకు తలనొప్పిగా మారింది.

ప‌వ‌న్ రెండు చోట్లా గెలుస్తున్నారా... ఎఫెక్ట్ ఎవరికి...? ఆ రెండు పార్టీల్లో కొత్త టెన్షన్ ..!

జనసేన పార్టీ స్థాపించిన నాటినుండి పవన్ పార్టీపై ఏదో ఒక దుష్ప్రచారం

జనసేన పార్టీ స్థాపించిన నాటినుండి పవన్ పార్టీపై ఏదో ఒక దుష్ప్రచారం

జనసేన పార్టీ స్థాపించి తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన నాటి నుండి పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చెయ్యాలని పవన్ కళ్యాణ్ భావిస్తే తొలి నాటి నుండి జనసేన పార్టీ పై రకరకాల ప్రచారాలు పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టాయి. జనసేన పార్టీ నాడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలాగే ఉంటుందని , నాడు ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసినట్టే జనసేనాని కూడా పార్టీని ఎన్నికల తర్వాత విలీనం చేస్తారని రకరకాల ప్రచారాలు సాగాయి. ఇక వాటిని తట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి ఫలితాలలో ప్రజాదరణ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్.

తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉన్న జనసేన పార్టీ .. ఎన్నికల్లో దెబ్బ కొట్టేందుకు పవన్ పార్టీపై దుష్ప్రచారం

తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉన్న జనసేన పార్టీ .. ఎన్నికల్లో దెబ్బ కొట్టేందుకు పవన్ పార్టీపై దుష్ప్రచారం

ఇక ఇదే సమయంలో తెలంగాణాలో కూడా పట్టు బిగించడానికి జనసేన గట్టిగానే పనిచేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని నిలబెట్టింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలైన ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికల్లో కూడా పెద్ద సంఖ్యలోనే అభ్యర్థులను నిలుపుతోంది. తెలంగాణ యువతలో సైతం తెలంగాణాలో జనసేన భవిష్యత్తులో బలమైన ప్రతిపక్షం కాగలదనే నమ్మకం వినిపిస్తోంది. ఇక ఈ సమయంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ పై మరోమారు ప్రచారం మొదలైంది.

 పవన్ మళ్ళీ సినిమాలలోకి వెళ్తాడని దుష్ప్రచారం .. తిప్పి కొడుతున్న జనసైన్యం

పవన్ మళ్ళీ సినిమాలలోకి వెళ్తాడని దుష్ప్రచారం .. తిప్పి కొడుతున్న జనసైన్యం

పవన్ పార్టీని దెబ్బ కొట్టటానికి పవన్ త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడనే ప్రచారం మొదలుపెట్టారు. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఇకపై సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని గట్టిగానే చెప్పారు. అయినా ఈ తరహా పుకార్లతో మెల్లగా ఆయన సినిమాలు వైపుకు వెళ్ళిపోతారని, కనుక రాజకీయంగా ఆయన్ను, జనసేనను నమ్ముకోవడం వ్యర్థమనే భావన ప్రజల్లో కల్పించేందుకే ఈ ప్రచారం మొదలుపెట్టారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఈ వార్తల్ని ఖండిస్తూ పవన్ పూర్తిస్థాయి రాజకీయాలకే అంకితమని చెబుతున్నారు. కానీ ఎన్నికల ప్రచారం కంటే తమ పార్టీ అధినేత మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవటమే జనసేన వర్గాలకు పెద్ద టాస్క్ లా తయారైంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janasana is working hard to get hold of Telangana. Participating in some of the seats in the parliamentary elections in Telangana, and now janasena is contesting a large number of candidates in the local body elections, including the MPTC and the ZPTC. Even Telangana youth believe that Janasena will be a strong opposition in Telangana. 'Pavan kalyan is planning to re entry into the films 'To defeat janasena this is a propaganda spreading by some people .To prevent this rumours is a big task for the janasena team .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more