వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ హాండ్ పవర్.!అలా పట్టుకున్నాడు..ఇలా పద్మశ్రీ వరించింది.!తిరుగులేని మొగిలయ్య.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కొందరికి సుడి ఎక్కడ, ఎప్పుడు ఒడి తిరుగుతుందో చెప్పడం కష్టం. కానీ ఉన్నట్టుండి వ్యవహారం, అవతారం అన్నీ మారిపోతాయి. ఒక చిన్న ఉపాయం జీవితాన్ని మార్చేసింది అన్నట్టు ఓ చిన్న ప్రయత్నం మొత్తం జీవితాన్ని ఎక్కడికోతీసుకెళ్లింది. మొన్నటి వరకూ ఎవ్వరికీ తెలియని ఓ సాదా సీదా నిరుపేద కళాకారుడు కిన్నెర మొగిలయ్య ఇప్పుడు ఓ చిన్న పాటి సెలబ్రిటీ.

పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం.. మొగిలయ్య జీవితాన్ని మార్చేసింది..

పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం.. మొగిలయ్య జీవితాన్ని మార్చేసింది..

ఎవ్వరూ గుర్తుపట్టని స్థాయి నుండి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తుపట్టి పలకరించే స్ధాయికి చేరుకున్నాడంటే దాని వెనక ఓ పవర్ ఉందన్న అంశం మరిచిపోవదద్దు. భీమ్లా నాయక్ సినిమా కోసం మొగిలయ్యతో పాట పాడించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన జీవితాన్నే మార్చేసారు. పాట పాడిన మరుక్షణం నుండి మొగిలయ్య పేరు రెండు రాష్ట్రాల్లో మారుమోగి పోయింది. ఐతే పవన్ కళ్యాణ్ చేసిన పని మొగిలయ్యకు రెండు రకాల గుర్తింపును తెచ్చింది.

ఊహించని జీవిత మలుపు.. భీమ్లా నాయక్ పాట మొగిలయ్య జీవితాన్ని మార్చేసింది

ఊహించని జీవిత మలుపు.. భీమ్లా నాయక్ పాట మొగిలయ్య జీవితాన్ని మార్చేసింది

మొగిలయ్యలో ఉన్న గాయకుడిని బయట ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా అంతరించిపోతున్న అరుదైర కిన్నెర వాయిద్యం వంటి కళను సజీవంగా కాపాడుతూ భావితరాలకు అందిస్తున్న మొగిలయ్య సంకల్పం గొప్పదనే చర్చ కూడా జరుగుతోంది. అసలు ఏ మాత్రం గుర్తింపులేని కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ పాటలను పాడుకునే మొగిలయ్య ఓ గొప్ప కళను తాను ముందు తరాలకు అందిస్తున్నట్టు, ఆ కళక ఓ వినూత్న ప్రత్యేకత ఉన్నట్టు కూడా అతనికి తెలియదు.

అరుదైన కిన్నెర వాయిద్య కళ.. పద్మశ్రీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

అరుదైన కిన్నెర వాయిద్య కళ.. పద్మశ్రీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడినందుకు రాష్ట్ర ప్రజలనుండి ఊహించని గుర్తింపు రాగా, తాను వాయిస్తున్న అరుదైన కిన్నెర వాయిద్యం వల్ల దేశ వ్యాప్తంగా గుర్తింను లభించింది. వినోదాన్ని పంచే వినూత్న కిన్నెర వాయిద్యం కళ అరుదైనదిగా భావించి, దానినే జీవనోపాదిగా మలుచుకుని జీవనం కొనసాగిస్తున్న మొగిలయ్య కళను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే పద్మశ్రీ అవార్టుతో సముచిత గుర్తింపునిచ్చింది.

అరుదైన కళను నమ్ముకున్న మొగిలయ్య.. సముచిత గుర్తింపునిచ్చిన కేంద్రం

అరుదైన కళను నమ్ముకున్న మొగిలయ్య.. సముచిత గుర్తింపునిచ్చిన కేంద్రం

ఇప్పుడు మన కిన్నెర మొగిలయ్య రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు, భారతదేశానికే సెలబ్రిటీ. ఎక్కడో మారుమూలన ఉండే మొగిలయ్య కళను గుర్తించి, ఆయన కళ నాలుగుగోడలకు పరిమితం కాకూడదు, ప్రపంచానికి తెలియాలనే కృతనిశ్చయంతో పవన్ కళ్యాణ్ మొగిలయ్యను ప్రోత్సహించారు. సినిమాలో పాడాలని అవకాశం కల్పించారు. అంతే మన కిన్నెర మొగిలయ్యకు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేకుండా పోయింది, ఆయన కళకు ఎదురులేకుండా పోయింది. ఇప్పుడు కేంద్రం మొగిలయ్యకు పద్మశ్రీ ప్రకటించడంతో తెలుగు ప్రజలకు మొగిలయ్య కన్నా పవన్ కళ్యాణ్ ఫ్లాష్ అవుతున్న సందర్బం చోటుచేసుకుంది.

English summary
Power star Pawan Kalyan, who sang with Mogila for the movie Bhimla Nayak, changed his life. From the moment the song was sung, Mogila's name became entrenched in both the states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X