వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్.. సలహాలు కావాలంటే అడుగు, నేనిస్తా: మహేష్ కత్తి

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్‌పై సినీ క్రిటిక్ మహేష్ కత్తి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. రూల్స్ ప్రకారం చూసుకుంటే జనసేన అసలు పార్టీయే కాదంటూ ఓ ట్వీట్ లో మహేష్ కత్తి తేల్చేశాడు.

నేను ఫోన్ చేస్తే ఆ ఎంపీ లిఫ్ట్ చేయలేదు, అవమానించినా ప్రజల కోసం మద్దతు ఇచ్చాను: పవన్ కళ్యాణ్నేను ఫోన్ చేస్తే ఆ ఎంపీ లిఫ్ట్ చేయలేదు, అవమానించినా ప్రజల కోసం మద్దతు ఇచ్చాను: పవన్ కళ్యాణ్

ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన ప్రాథమిక అర్హతలు కూడా జనసేనకు లేవని వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ఆ పార్టీలో జనం లేరు, సేన లేదని.. కేవలం పిచ్చి అభిమానులు, కులపిచ్చిగాళ్లు మాత్రమే ఉన్నారంటూ వ్యాఖ్యానించాడు.

మరో ట్వీట్‌లో ''ప్రతిదానికీ 'చంద్రబాబుకు తెలియకపోవచ్చు' అంటావేంటయ్యా బాబూ.. ఆయన ముఖ్యమంత్రి కాడా లేక అంత పనికిమాలిన వ్యక్తి అని నీ అభిప్రాయమా? లేకపోతే ఎలా వెనకేసుకు రావాలో నీకు అర్థం కావడంలేదా?'' అంటూ ఎద్దేవా చేశాడు.

అఖిలప్రియా.. అమ్మానాన్నను కోల్పోయావ్.. ఆ బాధ నీకే ఎక్కువ తెలియాలి: పవన్అఖిలప్రియా.. అమ్మానాన్నను కోల్పోయావ్.. ఆ బాధ నీకే ఎక్కువ తెలియాలి: పవన్

అంతేకాదు, మంచి సలహాదారులను, కన్సల్టెంట్లను, లాంగ్వేజి ట్రైనర్లను నియమించుకోమంటూ పవన్ కళ్యాణ్‌కు సూచించాడు. ''సలహాలు కావాలంటే అడుగు, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా..'' అంటూ తన ట్వీట్‌లో హహేష్ కత్తి పేర్కొన్నాడు.

English summary
Cine Critic Mahesh Katti is continuing his tweets on Janasena Chief Pawan Kalyan. In his recent tweets he mentioned that Janasena is not at all a political party according to the rules. Not only that he commented that in Janasena.. there is no janam and sena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X