వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు రాజమౌళి షాక్: మహేష్ బాబు ద్రోహి..'రియల్' హీరో పవన్ వెంట నడువు: వర్మ

హోదా కోసం ఉద్యమిస్తున్న పవన్ కళ్యాణ్ పైన ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. అందరు సినిమా హీరోల్లాగా పవన్ కాదన్నారు. మహేష్ బాబుపై ఆగ్రహించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: ప్రత్యేక హోదా విషయంలో ప్రముఖ దర్శకులు రాజమౌళి ఏపీ సీఎం చంద్రబాబుకు షాకిచ్చారు. హోదా నిరసనకు ఆయన మద్దతు తెలిపారు. పార్లమెంటులో ఇచ్చిన వాగ్ధానాలు అమలు కావాలన్నారు.

పోలీసులు అలా, పవన్-జగన్ ఇలా: 'రాష్ట్రం పరువు తీయకండి'పోలీసులు అలా, పవన్-జగన్ ఇలా: 'రాష్ట్రం పరువు తీయకండి'

హింస కన్నా శాంతియుత నిరసనలే మేలని చెప్పారు. దానినే తాను గౌరవిస్తానని చెప్పారు. అటువంటి వాతావరణాన్నే కోరుకుందామన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశారు.

పవన్‌కు వర్మ ప్రశంస, మహేష్‌పై ఆగ్రహం

హోదా కోసం ఉద్యమిస్తున్న పవన్ కళ్యాణ్ పైన ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. అందరు సినిమా హీరోల్లాగా పవన్ కాదన్నారు. అందరు హీరోలు సినిమాలో పోలీసులతో, రాజకీయ నాయకులతో పోరాటం చేస్తారని, పవన్ మాత్రం నిజ జీవితంలో అసలు విలన్లయిన పోలీసులు, రాజకీయ నాయకులతో పోరాడుతున్నారన్నారు.

pawan kalyan

బ్రూస్ లీ, సిల్వస్టర్ స్టాలోన్, అర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ వంటి వారు కూడా సాధారణ పోరాటాలు మాత్రమే చేశారని, పవన్ ఒక్కడు మాత్రం ప్రభుత్వాలతో పోరాడుతున్నారని ట్వీట్ చేశారు. ఆర్కే బీచ్‌లో నిరసన తెలుపుతున్న జనసేనకు మద్దతు తెలిపారు. పవన్ కళ్యాణ్ రియల్ హీరో అన్నారు.

చప్పట్లు కొట్టిందీ మీరే, చేయని తప్పుకు విడిపోయాం, భయపడాలి: బాబుకు పవన్చప్పట్లు కొట్టిందీ మీరే, చేయని తప్పుకు విడిపోయాం, భయపడాలి: బాబుకు పవన్

అదే సమయంలో, ప్రిన్స్ మహేష్ బాబు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్, మహేష్‌ను పోల్చారు. మహేష్ తమిళుల జల్లికట్టుకు మద్దతు తెలిపారని, కానీ ఏపీ ప్రత్యేక హోదాను మాత్రం పట్టించుకోలేదన్నారు. హోదా నిర్ణయాన్ని పవన్ పట్టించుకున్నంతగా మహేష్ పట్టించుకోలేదన్నారు. మహేష్ బాబుకు తమిళులపై ఉన్న శ్రద్ద ఏపీ ప్రజలపై లేదన్నారు.

ద్రోహులుగా మిగిలిపోతారు

పవన్ కళ్యాణ్ నిరసనకు మద్దతు పలకాలని మహేష్ బాబుకు ఫ్యాన్స్ చెప్పాలని లేదంటే వారు కూడా ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. ప్రత్యేక హోదా పైన స్పందించక పోవడం వల్ల మహేష్ బాబు ద్రోహిగా మిగిలిపోయారని అభిప్రాయపడ్డారు. ఎవరి వల్ల ఇంత ఎదిగాడో వారికి మద్దతు పలకడం లేదన్నారు. నిజంగానే రాజకీయ అంశాలపై మాట్లాడకూడదనుకుంటే జల్లికట్టుకు ఎందుకు మద్దతు పలికారని ప్రశ్నించారు.

English summary
Ram Gopal Varma has parised Jana Sena chief Pawan Kalyan and lashed out at Mahesh Babu. He said that Mahesh Babu is traitor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X