హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అది ముఖ్యం కాదు, ఫ్యాన్స్‌కు ఝలక్: పవన్ లక్ష్యం 2019 కాదు, మరో 30 ఏళ్లు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖమ్మం చేరుకున్నారు. ఆయన మంగళవారం ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లా పార్టీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. బుధవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో భేటీ అవుతారు.

Recommended Video

కాంగ్రెసుకు గుబులు, తెలంగాణలో పవన్ పక్కా ప్లాన్‌ !

'పవన్‌కు జనాలు వస్తారు కానీ, బీజేపీతో జగన్ ఒప్పందం అలా బట్టబయలు!''పవన్‌కు జనాలు వస్తారు కానీ, బీజేపీతో జగన్ ఒప్పందం అలా బట్టబయలు!'

అందుకోసం ఆయన కరీంనగర్ నుంచి కొత్తగూడెం చేరుకున్నారు. కొత్తగూడెంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సింగరేణి అతిథి గృహంలో పవన్ బస చేశారు. ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో భేటీ కానున్నారు.

చదవండి: చిరంజీవితో సంబంధం లేదన్న కాసేపటికే.. పవన్ కళ్యాణ్‌పై రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇలా!

పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు తరలివచ్చారు

పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు తరలివచ్చారు

పవన్ కళ్యాణ్ రావడంతో ఆయనను చూసేందుకు జనసేన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఆసక్తి చూపారు. బుధవారం ఉదయం కొత్తగూడెం నుంచి ఆయన సుజాతనగర్‌, జూలురుపాడు, ఏన్కూరు. తల్లాడ, వైరా మీదుగా ఖమ్మం నగరం చేరుకుంటారు. ఆయన రోడ్డు షో నిర్వహించనున్నారు. ఖమ్మం చేరుకున్న తర్వాత ఎంబీ గార్డెన్‌లో పూర్వ ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో సమావేశమవుతారు.

ఖమ్మంలో రోడ్డు షో

ఖమ్మంలో రోడ్డు షో

జనసేన స్థాపించిన అనంతరం కరీంనగర్‌ జిల్లా కొండగట్టు నుంచి తెలంగాణలో రాజకీయ ప్రస్థానాన్ని పవన్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఖమ్మంలో నిర్వహించే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. పర్యటన, రోడ్డు షో, సమావేశం ఏర్పాట్లను జనసేన కార్యకర్తలు చూసుకున్నారు.

 గతంలో ఎంపికలు జరిగాయి

గతంలో ఎంపికలు జరిగాయి

జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత 2017 సెప్టెంబర్ 7న ఖమ్మం నగరంలోని ఎంబీ గార్డెన్‌లో మూడు విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. విశ్లేషకులు, కంటెంట్ రైటర్స్, స్పీకర్స్ విభాగాల్లో ఎంపికలు చేశారు. ఆ సమయంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వేలమంది హాజరయ్యారు.

 పవన్ కళ్యాణ్ లక్ష్యం 2019 కాదు

పవన్ కళ్యాణ్ లక్ష్యం 2019 కాదు

ఇదిలా ఉండగా, తన లక్ష్యం 2019 ఎన్నికలు కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు. వచ్చే 25 - 30 ఏళ్లు నిర్మాణాత్మక రాజకీయాలు తన లక్ష్యమని చెప్పారు. మార్చి 14న కార్యాచరణ ప్రణాళిక విడుదల చేస్తానని చెప్పారు.

సెల్ఫీలు, ఫోటోల కంటే ఇది ముఖ్యం

సెల్ఫీలు, ఫోటోల కంటే ఇది ముఖ్యం

ఖమ్మం బయలుదేరే ముందు పవన్ మాట్లాడారు. తనకు అద్భుత ఆతిథ్యం ఇచ్చిన కొత్తగూడెం ప్రజలకు కృతజ్ఞతలు అన్నారు. కొత్తగూడెం సమస్యలు తెలుసుకునేందుకే తాను వచ్చానని చెప్పారు. సెల్ఫీలు, ఫోటోల కన్నా ప్రజా సమస్యల పరిష్కారం ముఖ్యమని చెప్పారు. అభిమానులు సెల్ఫీలు, ఫోటోల కోసం ఉత్సాహం చూపిస్తుండటంతో సున్నితంగా వారించారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలన్నారు. పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ, మైనింగ్ వర్సీటీని ఏర్పాటు చేయాలన్నారు.

 శ్రీజ ఆరోగ్యంగా ఉండటం సంతోషకరం

శ్రీజ ఆరోగ్యంగా ఉండటం సంతోషకరం

శ్రీజ ఆరోగ్యంగా ఉండటం తనకు సంతోషం కలిగించిందన్నారు. గతంలో ఆమె అనారోగ్యానికి గురైనప్పుడు, తాను పవన్‌ను కలుసుకోవాలని అనుకుంటున్నానని చెప్పినప్పుడు జనసేనాని ఆమెను కలిసి, సహాయం చేసిన విషయం తెలిసిందే.

English summary
As part of the ‘Chalore Chalore Chal’ yatra in the State, the Jana Sena Party Chief Pawan Kalyan reached Coal town of Kothagudem here on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X