హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అది గుర్తుండిపోయే సంఘటన: హరికృష్ణపై పవన్, జూ.ఎన్టీఆర్ వెన్నంటే కొడాలి నాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

నందమూరి హరికృష్ణకు ప్రముఖుల నివాళులు

హైదరాబాద్: నందమూరి హరికృష్ణకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మృతి ఎంతో బాధ కలిగించిందని అన్నారు. హరికృష్ణతో చాలా తక్కువసార్లు కలుసుకున్నానని చెప్పారు.

చదవండి: 10 ని.ల్లో ఆసుపత్రిలో చేర్పించినా.. హరికృష్ణ మృతి: అతివేగమే కారణం, అలా పల్టీ కొట్టింది

రాజ్యసభకు రాజీనామా గుర్తుండిపోయే విషయం

రాజ్యసభకు రాజీనామా గుర్తుండిపోయే విషయం

ఏపీకి అన్యాయం జరగడంపై విభజన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇది అందరికీ గుర్తుకు ఉండిపోయే సంఘటన అన్నారు. ఇది బాధ కలిగించే విషయం అన్నారు. యాక్టింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.

జూనియర్ వెన్నంటే కొడాలి నాని

జూనియర్ వెన్నంటే కొడాలి నాని

నందమూరి హరికృష్ణ కుటుంబం అంటే ఎమ్మెల్యే కొడాలి నానికి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయనకు చాలా అభిమానం. జూనియర్‌కు అత్యంత దగ్గరి సన్నిహితుల్లో ఈయన ఒకరు. హరికృష్ణ మృతి విషయం తెలియగానే కొడాలి నాని హుటాహుటిని వచ్చారు.

హరికృష్ణ భౌతిక కాయాన్ని కిందకు దించారు

హరికృష్ణ భౌతిక కాయాన్ని కిందకు దించారు

విషయం తెలియడంతో కొడాలి నాని ఆసుత్రికి వచ్చారు. నార్కట్‌పల్లి ఆసుపత్రి నుంచి భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తరలించే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నారు. జూ. ఎన్టీఆర్‌ను ఓదార్చారు. హరికృష్ణ భౌతికకాయాన్ని అంబులెన్స్ నుంచి కిందికి దించారు.

హరికృష్ణ లేకుంటే రాజకీయ జీవితం లేదని

హరికృష్ణ లేకుంటే రాజకీయ జీవితం లేదని

హరికృష్ణ అకాల మరణంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి హరికృష్ణ అన్నారు. తనను కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించింది ఆయనే అని, హరికృష్ణ లేనిదే తనకు రాజకీయ జీవితం లేదన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan recalls Nandamuri Harikrishna Resignation Incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X