రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్! చేతులు జోడించి వేడుకుంటున్నా, మమ్మల్ని వదిలేయండి, ఇక చాలు: పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Kalyan With Folding Hands Requests KCR To Leave Andhra People | Oneindia Telugu

హైదరాబాద్/రాజమండ్రి: 'వైయస్ జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్‌కు, చంద్రబాబుకు తెలియజేస్తున్నాను. మీ మీ గొడవలు ఉంటే దయచేసి రాష్ట్రాన్ని బలి చేయకండి' అని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాని మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు వద్దని చంద్రబాబు, కేసీఆర్, జగన్‌లకు సూచించారు.

కేసీఆర్‌కు చేతులు జోడించి వేడుకుంటున్నా

కేసీఆర్‌కు చేతులు జోడించి వేడుకుంటున్నా

రాష్ట్రం విడిపోయాక కొందరు దొడ్డిదారిన ఏపీకి వచ్చారని, విభజన నేపథ్యంలో మేం ఆల్ రెడీ (ఏపీ) దెబ్బతిన్నామని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, మళ్లీ ఇంకోసారి తమను ఇబ్బంది పెట్టవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చేతులు జోడించి వేడుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఈ రాజమండ్రి వేదికగా కేసీఆర్‌కు ఈ విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.

మీరు మళ్లీ వస్తే పాతరోజులు పునరావృతం

మీరు మళ్లీ వస్తే పాతరోజులు పునరావృతం

దయచేసి అందరం బాగుందామని, మీరు అద్భుతమైన నాయకులు అని కేసీఆర్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంకోసారి మమ్మల్ని (ఏపీ ప్రజలను) ఇబ్బంది పెట్టవద్దన్నారు. ఇక్కడ ఏదో చిన్నపాటి గొడవలు ఉంటాయని, అడ్జస్ట్ చేసుకొని వెళ్దామన్నారు. జగన్ మీకు బాగా అర్థమయ్యే వ్యక్తి అని, చంద్రబాబు వద్ద మీరు పని చేశారని, కాబట్టి సామరస్యంగా వెళ్దామని కేసీఆర్‌కు సూచించారు. దయచేసి మళ్లీ మీరు ఇలా వచ్చి గొడవలు పెంచితే పాతరోజులు పునరావృతం అవుతాయన్నారు. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానని చెప్పిన కేసీఆర్ వ్యాఖ్యలను ఉద్దేశించి ఇలా చెప్పారు.

దయచేసి వదిలేయండి

దయచేసి వదిలేయండి

మేం (ఏపీ ప్రజలు) అలసిపోయామని, దశాబ్దం పాటు మీ చేతిలో తిట్లు తిన్నామని, ఒక్కసారి రెండు చేతులు జోడించి కేసీఆర్‌కు నమస్కరిస్తున్నానని, దయచేసి ఆంధ్రుల్ని వదిలేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ చెప్పారు. అందరం కలిసి ఉండేవాళ్లమని, ఒకే దేశంలో ఉండేవాళ్ళమని, మీరు పాకిస్తానీలు కాదు, మేమే భారతీయులం కాదని, అందరం తెలుగోళ్లం, భారతీయులం అన్నారు. వ్యక్తిగత కక్షలతో ప్రజల మధ్య గొడవలు పెట్టవద్దన్నారు. రాజ్యాల మధ్య విరోధం ఉంటుందని, కానీ ప్రజల మధ్య ఉండదని, కానీ మీరు ప్రజల మధ్య విరోధం పెంచుతానని చెబితే ఎలా, ఎంతసేపు విషపూరితపు మాటలు మాట్లాడుతా అంటే ఎలా అన్నారు. జగన్, కేసీఆర్, చంద్రబాబులకు ఒక్కటే చెబుతున్నానని, మీ గొడవలకు తెలుగు రాష్ట్రాలను బలి చేయవద్దన్నారు. చిన్నపాటి గొడవలు ఉంటే సర్దుకుపోదామన్నారు.

English summary
Janasena chief Pawan Kalyan requested Telangana chief minister K Chandrasekhar Rao to leave Andhra Pradesh people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X