వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనేం బంగారం కాదు, చంపేసే సహనం వద్దు, కొట్టమని అర్థమా: పవన్ కళ్యాణ్

తనపై విమర్శలు, అభిమానులు, విమర్శకుల మాటల యుద్ధంపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ అంశంపై ఆయన ఎంతో సున్నితంగా మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: తనపై విమర్శలు, అభిమానులు, విమర్శకుల మాటల యుద్ధంపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ అంశంపై ఆయన ఎంతో సున్నితంగా మాట్లాడారు. ఇటీవల మహేష్ కత్తి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

చదవండి: పవన్ కళ్యాణ్ అన్నదొకటి, అర్థం చేసుకున్నది మరొకటి

మొదట్నించీ ఉన్నదే, ఇది కాలపరీక్ష

మొదట్నించీ ఉన్నదే, ఇది కాలపరీక్ష

చాలామందికి తమదైన ఓ గొంతు ఉన్నప్పుడు ఎందుకో ఇరిటేడ్ అవుతారని, విమర్శ అనేది తనకు కొత్త ఏమీకాదని, సినిమాల్లోకి తాను వచ్చినప్పటినుంచి ఉన్నదేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇదంతా కాల పరీక్ష, అంతే అన్నారు.

Recommended Video

"Will Pawan Tweet Only After My Death?" Mahesh Katthi Says |
నేనేం బంగారం కాదు.. భరించేందుకు సిద్ధం

నేనేం బంగారం కాదు.. భరించేందుకు సిద్ధం

ద్వేషాన్ని, ప్రేమని, అభిమానాన్ని అన్నీ భరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను నచ్చడానికి బంగారం కాదని, తనను తిట్టేవారు ఎంతోమంది ఉంటారన్నారు.

కాలం వృథా, వారిని వారు నాశనం చేసుకున్నట్లే

కాలం వృథా, వారిని వారు నాశనం చేసుకున్నట్లే

అది ముందు చూడాలని, తనను ద్వేషించే వ్యక్తి తన సమయాన్ని వృధా చేసుకున్నట్లేనని, ద్వేషం వల్ల రక్తం కాలుష్య భరితమవుతుందని, ముఖ కండరాలు పాడవుతాయని, వారిని వారు నాశనం చేసుకోవడమేనని పవన్ కళ్యాణ్ అన్నారు.

హద్దు దాటే సహనాన్ని భరించలేను

హద్దు దాటే సహనాన్ని భరించలేను

సహనం ఉండాలని, మరీ హద్దులుదాటి మనల్ని చంపేసే సహనాన్ని తాను భరించనని, అంత అతి మంచితనం తనకు ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.

దాడి చేస్తే చేతులు అడ్డుపెట్టుకోవడం తప్పా?

దాడి చేస్తే చేతులు అడ్డుపెట్టుకోవడం తప్పా?

దాడి చేసేవారిని వద్దని వారించడానికి చేతులు అడ్డుపెట్టుకోవడం తప్పా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కొట్టమని దానికి అర్థమా? అందుకే చేతులు కట్టుకుని కూర్చేనే అవసరం లేనేలేదన్నారు.

ఇలాంటి వాళ్లను పెంచి పెద్ద చేయొద్దు

ఇలాంటి వాళ్లను పెంచి పెద్ద చేయొద్దు

అదే సమయంలో ఎదురుదాడి చేయాల్సిన అవసరం లేదని, అవసరమైనే మనల్ని మనం కాపాడుకుందామని, విమర్శించే వాడి స్థాయిని చూడాలని, ఇలాంటి వాళ్లను పెంచి పెద్ద చేయడం తప్పా మరొకటి కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఎవరినైనా ఏదైనా అంటే దానిపై నిలబడతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదని తేల్చి చెప్పారు.

English summary
Jana Sena chief and Power Start Pawan Kalyan responded indirectly on Mahesh Kathi, who criticised him recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X