వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ వాళ్లు కొడతారని పారిపోయారు, అప్పుడే తెలిసింది: ఓయు విద్యార్థులపై పవన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

భీమవరం: కష్టాలలో ఉన్నప్పుడే మనుషుల వ్యక్తిత్వాలు బయటకు వస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భీమవరంలో శ్రీవిష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థులతో గురువారం సాయంత్రం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నేతలను విమర్శించినప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిని పంచెలూడదీసి కొడతానని తాను అన్న తర్వాత పార్టీ కార్యాలయంలో ఒక్కరు కూడా లేరని గుర్తు చేసుకున్నారు. అందరూ కనిపించకుండా పోయారన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించినప్పుడు పవన్ కళ్యాణ్ పంచెలూడదీసి కొడతానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఇక వదిలేయండి, జగన్ ఇంటి ఆడపడుచుల్ని లాగకండి: పవన్ కళ్యాణ్ ఇక వదిలేయండి, జగన్ ఇంటి ఆడపడుచుల్ని లాగకండి: పవన్ కళ్యాణ్

 కాంగ్రెస్ వాళ్లు దాడి చేస్తారని భయపడ్డారు

కాంగ్రెస్ వాళ్లు దాడి చేస్తారని భయపడ్డారు

దీనిని గుర్తు చేస్తూ పవన్ మాట్లాడారు. తాను ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ వారు వచ్చి దాడి చేస్తారని భయపడి అందరూ పారిపోయారని చెప్పారు. కానీ ఆ రోజు తనకు అండగా నిలబడింది ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులేనని అన్నారు. కష్టాల్లో ఉన్న సమయంలోనే అందరి వ్యక్తిత్వాలు బయటకు వస్తాయని, ఎవరైనా కష్టాల్లో ఉంటే తన గుండె తరుక్కుపోతుందని, కళ్లలో నీళ్లు వస్తాయన్నారు.

ఆ భ్రమలోనే వారు తిడతారు

ఆ భ్రమలోనే వారు తిడతారు

పబ్లిక్ పాలసీల మీద జ్ఞానం లేనివాళ్లు వ్యక్తిగత విమర్శలు చేస్తారని పవన్ అన్నారు. మనం భయపడతామనే భ్రమలో వారు తిడతారన్నారు. కానీ వాటిని పట్టించుకోకుండా ఆశయంతో ముందుకు సాగాలన్నారు. వాళ్లు ఎంత మొండితనంతో దోపిడీ చేస్తారో.. నేను కూడా నా ఆశయం కోసం అంతే మొండితనంతో ముందుకు సాగుతానని చెప్పారు.

ధైర్యే సాహసి లక్ష్మి

ధైర్యే సాహసి లక్ష్మి

ఢిల్లీలో అమ్మాయిపై అఘాయిత్యం జరిగిన తర్వాతే నిర్భయ చట్టం తీసుకు వచ్చారని పవన్ గుర్తు చేశారు. అంతకుముందు దేశంలో ఎక్కడా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగలేదా.. అంతకుముందు పెట్టి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. నాకు తెలిసింది చాలా తక్కువ అని, నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. ధైర్యే సాహసి లక్ష్మీ అనే సూత్రాన్ని నమ్ముతానని చెప్పారు.

Recommended Video

నారా లోకేష్ పై పవన్ వ్యాఖ్యలు
రెండుసార్లు డిప్రెషన్‌కు గురయ్యా

రెండుసార్లు డిప్రెషన్‌కు గురయ్యా

అఫ్పట్లో ఎంతోమంది మేధావులు రాజకీయాల్లో ఉండేవారని, ఇప్పుడు గూండాలు, బ్రోకర్లు, పైరవీకారులు, మాట తప్పేవాళ్లు ఉంటున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో తాను రెండుసార్లు డిప్రెషన్‌కు లోనయ్యానని, అందరి సహకారంతో అధిగమించానని చెప్పారు. నిరాశ, నిస్పృహ, నిరుత్సాహానికి లోనుకాకుండా ఆశయం వైపు సాగాలన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan said that Osmania University Students along with him when he was in critical.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X