వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌కు తెలంగాణపై ప్రేమెందుకు పుట్టింది, వైఎస్ఆర్‌ నాకు లైప్ ఇచ్చారు: పొన్నం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సీజనల్ రాజకీయ నాయకుడని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్, పవన్ కళ్యాణ్ ఒకరిపై మరోకరు తీవ్ర విమర్శలు చేసుకొని ఇప్పుడు అభినందించుకోవడంలో ఆంతర్యేమిటని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు తెలంగాణపై పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఎందుకు ప్రేమ కురిపిస్తాడో చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు.

టార్గెట్ 2019: కెసిఆర్‌కు వ్యతిరేకంగా మహకూటమి, పవన్ దారెటు?టార్గెట్ 2019: కెసిఆర్‌కు వ్యతిరేకంగా మహకూటమి, పవన్ దారెటు?

తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తోందని పొన్నం చెప్పారు. తమ నేతల మధ్య సమన్వయలోపం, విభేధాలున్నా, ఎన్నికల సమయంలో మాత్రం పార్టీ గెలుపు కోసం కలిసి కట్టుగా పనిచేస్తామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.

Recommended Video

జనసేనలోకి కీలక నేతలు, ఎవరికి షాక్ !

తెలంగాణలో పవన్‌కు ఏం సంబంధం, జనసేనకు ఓటింగ్ లేదు: ఉత్తమ్ సంచలనంతెలంగాణలో పవన్‌కు ఏం సంబంధం, జనసేనకు ఓటింగ్ లేదు: ఉత్తమ్ సంచలనం

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పలు విషయాలను వెల్లడించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కెసిఆర్‌కు వ్యతిరేకంగా తీర్పును ఇవ్వనున్నారని పొన్నం ప్రభాకర్ ధీమాను వ్యక్తం చేశారు.

 పవన్ కళ్యాణ్ సీజనల్ పొలిటీషీయన్

పవన్ కళ్యాణ్ సీజనల్ పొలిటీషీయన్

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సీజనల్ పొలిటీషీయన్ అని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణపై పవన్ కళ్యాణ్ కు హఠాత్తుగా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందో చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే 11 రోజుల పాటు భోజనం చేయలేదని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పుడేమో తెలంగాణ అంటే తనకు ప్రేమంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

 రాజకీయంగా లైఫ్ ఇచ్చింది వైఎస్ఆర్

రాజకీయంగా లైఫ్ ఇచ్చింది వైఎస్ఆర్

రాజకీయంగా తనకు మద్దతిచ్చింది వైఎస్ రాజశేఖర్‌ రెడ్డేనని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకొన్నారు ఏనాడూ కూడ తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శించలేదని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇప్పటికీ కూడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అంతే ప్రేమ ఉందన్నారు.

 శత్రువును ఓడించేందుకు ఏకమౌతాం

శత్రువును ఓడించేందుకు ఏకమౌతాం

కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఎంత సమన్వయ లోపం ఉన్నప్పటికీ శత్రువును ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఏకమౌతామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.నేతల మధ్య సమన్వయ లోపం అంతగా ఇబ్బంది పెట్టదని పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని పొన్నం ప్రభాకర్ ధీమాను వ్యక్తం చేశారు.

 శ్రీధర్ బాబు నాకు సోదరుడు

శ్రీధర్ బాబు నాకు సోదరుడు

మాజీ మంత్రి శ్రీధర్ బాబు తనకు తమ్ముడులాంటి వాడని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాజకీయాల్లో తన కంటే మూడేళ్ళ తర్వాత వచ్చారని ఆయన గుర్తు చేశారు. తమ మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని శ్రీధర్ బాబు చెప్పారు.

 కేసులు పెట్టుకోంది

కేసులు పెట్టుకోంది

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగిస్తామని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. సెక్షన్ 506, 507 ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రభుత్వంపై తాను విమర్శలు చేస్తానని దమ్ముంటే తనపై కేసులు పెట్టాలని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.

English summary
Karimngar former MP Ponnam Prabhakar made allegations on Janasena chief Pawan Kalyan on Monday. A Telugu Channel interviewed him. He said that Pawan a Seasoned politician.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X