వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది భజనసేన, టిఆర్ఎస్‌లో విలీనం చేయాలి, కెసిఆర్‌కు భయమదే: కాంగ్రెస్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కోసం ఉద్యమించినవారికి తెలంగాణలో పర్యటించేందుకు కెసిఆర్ ప్రభుత్వం అనుమతించడం లేదు, కానీ కెసిఆర్‌ తాట తీస్తానన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను పర్యటనకు కెసిఆర్ అనుమతించడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుబట్టారు. జనసేనను టిఆర్ఎస్‌ను విలీనం చేయాలని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌కు చురకలంటించారు.

Recommended Video

విధ్వంస రాజకీయాలు చేయను, చిరుతో సంబంధంలేదు,

పవన్ కళ్యాణ్ తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో తెలంగాణ సీఎం కెసిఆర్‌పై ప్రశంసలు కురిపించారు తెలంగాణపై తనకు అమితమైన ప్రేమ ఉందని ప్రకటించారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, సిఎల్పీ ఉప నేత జీవన్ రెడ్డిలు మంగళవారం నాడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కెసిఆర్ పాలన బాగుంటే ఎందుకు పర్యటిస్తున్నావని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు.

తెలంగాణలో సర్వే ఆధారంగానే కాంగ్రెస్ టిక్కెట్లు: ఇలా అయితే కట్ తెలంగాణలో సర్వే ఆధారంగానే కాంగ్రెస్ టిక్కెట్లు: ఇలా అయితే కట్

టిఆర్ఎస్‌లో జనసేనను విలీనం చేయాలి

టిఆర్ఎస్‌లో జనసేనను విలీనం చేయాలి

టిఆర్‌ఎస్‌లో జనసేనను విలీనం చేయాలని సిఎల్పీ ఉప నేత జీవన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి పరిపాలన అంత బాగా చేస్తుంటే ఎందుకు తెలంగాణలో పర్యటిస్తున్నావని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కాదని, భజనసేన అని అన్నారు. అప్పట్లో కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ ఇప్పుడు భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.పవన్ కల్యాణ్ తన జనసేనను టీఆర్ఎస్‌లో విలీనం చేస్తే మంచిందని చురకలంటించారు. తెలంగాణలో ఉద్యోగాల కోసం విద్యార్థులు ర్యాలీ చేస్తామంటే అనుమతి ఇవ్వలేదని, మందకృష్ణ దీక్ష చేపడితే జైల్లో పెట్టారని, మరి పవన్ యాత్రకు మాత్రం అనుమతి ఎందుకు ఇచ్చారని నిలదీశారు

కోందరామ్‌కు ఎందుకు అవకాశమివ్వలేదు

కోందరామ్‌కు ఎందుకు అవకాశమివ్వలేదు

తెలంగాణ కోసం పోరాటం చేసిన జెఎసి ఛైర్మెన్ కోదండరామ్‌ను తెలంగాణలో పర్యటించేందుకు ఎందకు అవకాశమివ్వలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. కోదండరామ్ కనీసం మీటింగ్ పెట్టుకొనే అవకాశం కూడ ఇవ్వడం లేదన్నారు.

కెసిఆర్ భయపడుతున్నారు

కెసిఆర్ భయపడుతున్నారు

తెలంగాణ సీఎం కెసిఆర్ భయపడుతున్నారని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే కోదండరామ్ తెలంగాణ ప్రాంతంలో పర్యటించేందుకు అనుమతివ్వడం లేదని వి. హనుమంతరావు చెప్పారు. కెసిఆర్ భయపడుతున్నాడని అందుకే కోదండరామ్ పర్యటనకు అనుమతించడం లేదని వి. హనుమంతరావు విమర్శించారు.

కలిసి తిరుగుదామన్న వి. హెచ్.

కలిసి తిరుగుదామన్న వి. హెచ్.

తెలంగాణలో కలిసి తిరుగుదామని వి. హనుమంతరావు పవన్ కళ్యాణ్ కు సూచించారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో పవన్ కళ్యాణ్ తో కలిసి తిరుగుదామని వి. హనుమంతరావు సూచించారు. మరో వైపు ఎక్కడ ఏం జరిగిందో తాను చెబుతానని వి. హనుమంతరావు చెప్పారు. ఆంధ్రాలో పర్యటించాలని పవన్ ‌కు వి. హనుమంతరావు సూచించారు. విమర్శలకు పవన్ కళ్యాణ్ ముందు సమాధానం చెప్పాలని వి. హెచ్ పవన్ కు సూచించారు.

English summary
CLP deputy leader Jeevan Reddy demanded that pawan kalyan should merge janasena with TRs. He spoke with media on Tuesdaya at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X