వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంత జరుగుతుంటే మౌనమా?: పవన్ కళ్యాణ్, మద్దతుగా అల్లు అర్జున్, '6 నెలలుగా కుట్ర'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఫిలిం ఛాంబర్ లో పవన్ తో మెగా ఫ్యామిలీ తో భేటీ

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుతో కలిసి శుక్రవారం ఫిలిం చాంబర్‌కు వచ్చారు. ఆయన న్యాయనిపుణులతో సమావేశమయ్యారు. పవన్ ఫిలిం చాంబర్‌కు రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు.

40 ఏళ్లన్నావ్.. సిగ్గుందా: బాబుపై అంబటి, నటి శ్రీరెడ్డి వెనుక వైసీపీ ఉందా అంటే..?40 ఏళ్లన్నావ్.. సిగ్గుందా: బాబుపై అంబటి, నటి శ్రీరెడ్డి వెనుక వైసీపీ ఉందా అంటే..?

ఇటీవల శ్రీరెడ్డి అంశం తెలుగు పరిశ్రమతో పాటు రాజకీయ రంగు పులుముకున్న విషయం తెలిసిందే. ఆమె జనసేనానిని టార్గెట్ చేయడంతో ఆమె వెనుక ఎవరో ఉన్నారని, ఆ శక్తులు రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ను ఆమెను ఉపయోగించుకుంటున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు, అల్లు అరవింద్‌తో పాటు శివబాలాజీ, తదితర అభిమానులు ఎందరో ఈ అనుమానం వ్యక్తం చేశారు.

జనసేన అనుమానాలు

జనసేన అనుమానాలు

ఇది చినికి చినికి వానగా మారింది. శ్రీరెడ్డి ఇష్యూ కాస్త రాజకీయ రంగు పులుముకుంది. పవన్‌ను టార్గెట్ చేయడంతో ఎవరో ఉన్నారనే అనుమానాలు జనసేనకు బలపడ్డాయి. తెరపైకి రామ్ గోపాల్ వర్మ వచ్చారు. దీంతో అల్లు అరవింద్, నాగబాబు, రామ్ చరణ్ తేజ-రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచింది. మరోవైపు శ్రీరెడ్డి, వర్మ ఓ మెట్టు దిగారు. కానీ నేరుగా పవన్ తల్లిని టార్గెట్ చేయడం వివాదం ముదిరింది.

పవన్ కళ్యాణ్ ఆగ్రహం

పవన్ కళ్యాణ్ ఆగ్రహం

పవన్ కళ్యాణ్ శుక్రవారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేయిస్తున్న వారికి అమ్మలు, అక్కలు, కోడళ్లు ఉన్నారని, కానీ వారి ఇంట్లో మహిళలే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారని, టీఆర్పీలు, రాజకీయ లాభాల కోసం వయసైపోతున్న తన 70 ఏళ్ల తల్లిని దూషిస్తున్నారని, టీఆర్పీల కోసం పోటీ పడుతున్నారని మండిపడ్డారు.

 అల్లు అర్జున్, నాగబాబుతో కలిసి ఫిలిం చాంబర్‌కు పవన్

అల్లు అర్జున్, నాగబాబుతో కలిసి ఫిలిం చాంబర్‌కు పవన్

అనంతరం, పవన్ కళ్యాణ్ నేరుగా ఫిలిం ఛాంబర్‌కు వచ్చారు. ఆయనతో పాటు నాగబాబు, అల్లు అర్జున్ హాజరయ్యారు. వీరు పవన్‌కు మద్దతుగా ఫిలిం చాంబర్‌కు వచ్చారు. న్యాయవాదులతో భేటీ అయ్యారు. అంతేకాదు, సినీ ప్రముఖులు అందరూ చాంబర్‌కు రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం అవుదామని చెప్పారు.

ఇండస్ట్రీలో ఇంత జరిగితే మౌనమా?

ఇండస్ట్రీలో ఇంత జరిగితే మౌనమా?

ఫిలిం చాంబర్‌లో పవన్ కళ్యాణ్ రెండు వైపులా తలుపులు పెట్టుకొని గదిలో కూర్చున్నట్లుగా తొలుత వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఇంత జరుగుతుంటే మౌనంగా ఎందుకు ఉన్నారని ఫిలిం చాంబర్‌లో పలువురిని ప్రశ్నించారని తెలుస్తోంది. దీనిపై మాట్లాడేందుకే సమావేశానికి ప్రముఖులు రావాలని పిలుపునిచ్చారు.

పవన్ వచ్చాడని తెలిసి అభిమానుల రాక

పవన్ వచ్చాడని తెలిసి అభిమానుల రాక

ఫిలిం చాంబర్‌కు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వచ్చారని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. వారిని చూసేందుకు ఎగబడ్డారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పైన కుట్ర జరుగుతోందని జనసేన అభిప్రాయపడుతోంది. గత ఆరు నెలలుగా పవన్ పైన కుట్ర సాగుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan on friday went to Film Chamber to talk about Sri Reddy issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X