వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు, పవన్‌కళ్యాణ్ మద్దతు మాకే'

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో జనసేన చీఫ్, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మద్దతు తమకే ఉంటుందని భూమా బ్రహ్మనందరెడ్డి సోదరి భూమా మౌనికరెడ్డి చెప్పారు.

సెంటిమెంట్ పునరావృతమౌతోందా, చరిత్ర తిరగరాస్తారా, నంద్యాల తీర్పు ఎలా ఉంటుంది?సెంటిమెంట్ పునరావృతమౌతోందా, చరిత్ర తిరగరాస్తారా, నంద్యాల తీర్పు ఎలా ఉంటుంది?

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కీలకంగా మారనున్నాయి.ముస్లిం ఓట్ల తర్వాత కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అత్యధికంగా ఉన్నాయి.ఆదివారం నాడు భూమా మౌనిక రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు

నంద్యాల: ఓట్ల చీలిక , రాయలసీమ సెంటిమెంట్, వైసీపీకి దెబ్బెనా?నంద్యాల: ఓట్ల చీలిక , రాయలసీమ సెంటిమెంట్, వైసీపీకి దెబ్బెనా?

జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ మద్దతు ఏ పార్టీకి లభిస్తే ఆ పార్టీ అభ్యర్థి విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీని కోసం కాపు సామాజికవర్గానికి చెందిన ఓట్లను గంపగుత్తగా రాబట్టుకొనేందుకుగాను పవన్‌కళ్యాణ్ మద్దతు కీలకంగా మారింది.

పవన్ మద్దతు భూమా కుటుంబానికే

పవన్ మద్దతు భూమా కుటుంబానికే

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మద్దతు భూమా బ్రహ్మనందరెడ్డికే ఉంటుందని టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి సోదరి మౌనిక రెడ్డి ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తమ కుటుంబానికి చాలా సన్నిహితుడని చెప్పారు. ఈ ఎన్నికల్లో పవన్ మద్దతు తమకే ఉంటుందనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.

 పవన్ మద్దతు ఎందుకంటే?

పవన్ మద్దతు ఎందుకంటే?

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 45వేలకు పైగా ముస్లిం మైనారిటీ ఓట్లున్నాయి. ఆ తర్వాత కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లున్నాయి. అయితే ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఏ పార్టి వైపుకు మొగ్గుచూపితే ఆ పార్టీ అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే అనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

భూమా కుటుంబంతో పవన్ కళ్యాణ్‌కు సన్నిహిత సంబంధాలు

భూమా కుటుంబంతో పవన్ కళ్యాణ్‌కు సన్నిహిత సంబంధాలు


2009 అసెంబ్లీ ఎన్నికల ముందు టిడిపికి గుడ్‌బై చెప్పి భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు పిఆర్‌పిలో చేరారు. అయితే ఆ సమయంలో ఆళ్ళగడ్డ నుండి పోటీచేసిన శోభా నాగిరెడ్డి విజయం సాధించిరు. భూమా నాగిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ సమయంలోనే పవన్‌కళ్యాణ్‌తో భూమా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ విషయాన్ని భూమా కుటుంబసభ్యులు పదే పదే గుర్తు చేస్తున్నారు.

25 శాతం ఓట్లను దక్కించుకొన్న పిఆర్‌పి అభ్యర్థి

25 శాతం ఓట్లను దక్కించుకొన్న పిఆర్‌పి అభ్యర్థి

2009 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసిన పిఆర్‌పి అభ్యర్థికి 35 వేల ఓట్లు వచ్చాయి. అయితే పోలైన ఓట్లలో సుమారు 25 శాతం ఓట్లు పిఆర్‌పి అభ్యర్థికి దక్కాయి. అయితే ఆనాటి పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులకు తేడా ఉంది. అయితే ఈ విషయమై పవన్ ఏం చేస్తారనేది ఆసక్తి నెలకొంది.

శిల్పా ఎఫెక్ట్: దిద్దుబాటులో టిడిపి, 'ఉప ఎన్నిక వాయిదాకు కుట్ర'శిల్పా ఎఫెక్ట్: దిద్దుబాటులో టిడిపి, 'ఉప ఎన్నిక వాయిదాకు కుట్ర'

అయితే ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. అయినా ఇంతవరకు ఈ విషయమై పవన్ తన అభిప్రాయాన్ని ప్రకటించలేదు.

English summary
Janasena chief Pawan kalyan will be support to Tdp said Bhuma Nagamounika reddy. Pawan kalyan close relation with my family said Bhuma Naga Mounika reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X