వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ నిర్ణయంతో మరణాలు.. డ్రగ్స్ కేసులో అట్టహాసం: పవన్ కల్యాణ్

సినిమా ఆర్టిస్టులు కొందరు డ్రగ్స్‌ తీసుకున్నారని ఆరోపిస్తూ అట్టహాసంగా దాడులు, దర్యాప్తులు జరిపిన తెలంగాణ ఆబ్కారీ శాఖకు ఓపెన్‌ బార్లతో వచ్చే సమస్యలు పట్టవా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Shatagni : Pawan Kalyan Questions Telangana Excise Department On Open Bars

హైదరాబాద్‌: సినిమా ఆర్టిస్టులు కొందరు డ్రగ్స్‌ తీసుకున్నారని ఆరోపిస్తూ అట్టహాసంగా దాడులు, దర్యాప్తులు జరిపిన తెలంగాణ ఆబ్కారీ శాఖకు ఓపెన్‌ బార్లతో వచ్చే సమస్యలు పట్టవా? అని జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు.

నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్‌ బార్లను విద్యాలయాలు, దేవాలయాల వద్ద నడుపుతుంటే ఎందుకు పట్టుకోవడం లేదని ఆయన అడిగారు. సంపూర్ణ మద్య నిషేధం వల్ల కొత్త సమస్యలు వస్తాయని పవన్‌ అన్నారు. గతంలో ఎన్టీఆర్‌ సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసినప్పుడు కల్తీ సారా అధికమై పలువురి మరణాలకు కారణమైందని అన్నారు.

 Pawan Klayan questions KCR regime on drugs case


శుక్రవారం హైదరాబాద్‌లో జనసేన డిజిటల్‌ రెజిమెంట్‌ సభ్యులతో ఆయన మాట్లాడారు. సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీ డిజిటల్‌ రెజిమెంట్‌ బృందానికి 'శతఘ్ని'గా నామకరణం చేసిన పవన్‌ కళ్యాణ్ జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వారికి సూచించారు.

అవినీతి రహిత.. ఓటుకు నోటు లేని రాజకీయాల కోసం నిరంతరం పోరాడతానని తెలిపారు. గెలిచేదాకా ఈ పోరాటం కొనసాగిస్తానని, అక్టోబరు నుంచి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తానని వెల్లడించారు. ఎన్నికల్లో కేవలం సీట్లు గెలవడమే తన లక్ష్యం కాదని, ప్రజల సమస్యల పరిష్కారమే ముఖ్యమని అన్నారు.

English summary
Jana sena chief Pawan Kalyan question Telangana excise department on open bars, referring to the enquiry of Cine artists in drugs case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X