హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాత బకాయిలకు పాత నోట్లే తీసుకుంటాం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :ఒక చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తోంది. అనేది ఒక ఆలోచన గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇదే తరహా ప్రయోగం హైద్రాబాద్ లో పాత బకాయిలను వసూలు చేసుకొనేందుకు ఉపయోగించింది జిహెచ్ ఎం సి. జిహెచ్ ఎం సి తో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థలు కూడ దీన్ని అమలు చేసి పాత బకాయిలను వసూలు చేసుకొన్నాయి. కోట్లాది రూపాయాలు గంటల వ్యవధిల్లోనే ప్రభుత్వ ఖజానాకు చేరాయి.

పన్నులు చెల్లించకుండా బకాయిలు పేరుకు పోయి జిహెచ్ఎం సి ఇబ్బందిపడుతోంది. గురువారం నాడు డిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. శుక్రవారం అర్థరాత్రి వరకు పాత నగదు నోట్ల ద్వారా బకాయిల చెల్లింపుకు అనుమతి ఇవ్వాలని కోరారు. విద్యుత్ బకాయిలు, ఆస్థిపన్ను చెల్లింపుతో పాటు ఇతర ప్రభుత్వ పన్నుల చెల్లింపుకు వర్తింపజేస్తూ కేంద్రం సానుకూలంగా స్పందించింది.

pay dues banned currency ,positive response in telangana

ఈ నిర్ణయంతో విద్యుత్ బకాయిలతో పాటు, ఆస్థి పన్ను, జలమండలి, గ్రామపంచాయితీ పన్నుల చెల్లింపులను చేయాలని ప్రజలకు కోరింది,.. తమ వద్ద ఉన్న నగదును వదిలించుకొనేందుకు ప్రజలు కూడ సిద్దమయ్యారు.ఈ మేరకు పన్నులు చెల్లించేందుకు ఉదయాన్నే జిహెచ్ ఎం సి, మీ సేవ సెంటర్ల వద్ద బారులు తీరారు.జిహెచ్ ఎం సి కి ఆస్థిపన్ను చెల్లింపుల కింద కేవలం రెండు గంటల్లో సుమారు 10 కోట్లకు పైగా వసూలయ్యాయి.

జలమండలి బకాయిల చెల్లింపులో కూడ ఇదే రకంగా ఉంది. సుమారు 4 కోట్లకు పైగా పాత బకాయిలు వసూలయ్యాయి. విద్యుత్ బకాయిల చెల్లింపు కోసం కూడ శుక్రవారం అర్థరాత్రి వరకు పాత నగదుతో బిల్లులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వడంతో భారీగా వసూళ్ళు ఉన్నట్టు విద్యుత్ శాఖాధికారులు చెబతుున్నారు.గ్రామపంచాయితీల్లో కూడ పాత బకాయిల చెల్లింపుల కోసం పాత నగదు నోట్లను తీసుకొంటామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బకాయిల చెల్లింపు కోసం ప్రజలు బారులు తీరుతున్నారు.

English summary
an idea can change life. telangana government idea successful working.ghmc,electricity department, hmda, and other departments implements this idea.pay dues banned currency is permitted government. ghmc get above 10 crores of rupees 2 hours only. other departments also positive response also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X