వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ కామెంట్లపై ఉత్తమ్ గుస్సా: గవర్నర్‌ని కలిస్తే తప్పేంటీ, పారాసెటమాల్‌ అని చెప్పి..

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్ కామెంట్లను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతలను అవమానించినట్టు మాట్లాడటం సరికాదన్నారు. తన రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి వ్యక్తిని చూడలేదని చెప్పారు. దేశంలో ఏ సీఎం కూడా ఇదివరకు ఇలా మాట్లాడలేదని చెప్పారు.

ఆర్మీలో పనిచేసి..

ఆర్మీలో పనిచేసి..

భారత్-చైనా సరిహద్దులో ఆర్మీలో పనిచేశానని ఉత్తమ్ గుర్తుచేశారు. కానీ తాను కేసీఆర్‌లో కేసుల్లో ఇరుక్కొలేదని చెప్పారు. దేశం కోసం ఆర్మీలో పనిచేసిన తాను.. కేసీఆర్ లాంటి వారితో మాటలు పడటం బాధగా ఉందన్నారు. తనను వ్యక్తిగతంగా దూషించడం మంచి పద్ధతి కాదన్నారు.

పంటకు ముందు ఇచ్చారా..?

పంటకు ముందు ఇచ్చారా..?

రైతుబంధు గురించి కేసీఆర్ సర్కార్ గొప్పలు చెప్పుకుంటుందని తెలిపారు. కానీ ఏ పంట ముందు రైతుబంధు ఇచ్చారో తెలియజేయాలని కోరారు. రాష్ట్రంలో రెండో దఫా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమవుతోన్న రూ. లక్ష రుణమాఫీ ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం రుణం మాఫీ చేస్తున్నామని గుర్తుచేశారు. ఛత్తీస్ గడ్, రాజస్థాన్ పర్యటించి.. రుణమాఫీ గురించి తెలుసుకోవాలని కేసీఆర్‌ను కోరారు.

పారాసెటమాల్‌తో..

పారాసెటమాల్‌తో..


కరోనా వైరస్ గురించి తొలినాళ్లలో పారాసెటమాల్‌తో పోతుందని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. అప్పుడు అలా చెప్పి.. ఇప్పుడు కరోనా మనతో పయనిస్తోందని చెప్పడం సరికాదన్నారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం లేదని.. ఎందుకు సామర్థ్యం మేరకు పరీక్షలు చేయడం లేదు అని ఉత్తమ్ ప్రశ్నించారు. మరణాలు, రికవరీ గురించి శాతాలతో వివరించిన కేసీఆర్.. పరీక్షల గురించి ఎందుకు నోరు మెదపలేదు అని అడిగారు.

Recommended Video

AP CM Jagan Launched Fishermen Bharosa Scheme, Rs 10,000 To Beneficiaries
గవర్నర్‌ను కలవొద్దా..?

గవర్నర్‌ను కలవొద్దా..?

ధాన్యం కొనుగోళ్లు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ని కలిస్తే సమస్య ఏంటీ అని అడిగారు. గవర్నర్ హక్కులను కేసీఆర్ కాలరాస్తారా అని ప్రశ్నించారు. ఇంటింటికీ మంచినీరు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. మాటే మరచిపోయారని పేర్కొన్నారు.

English summary
pcc chief uttamkumar reddy angry on cm kcr comments. what is the problem to cm kcr, we met governer he ask.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X