వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మిత సబర్వాల్ ఇష్యూ: ఔట్‌లుక్‌కు పిసిఐ నోటీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై అనుచిత వాఖ్యలు రాసిన ఔట్‌లుక్ మ్యాగజైన్‌కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) నోటీసులు జారీ చేసింది. స్మితా సబర్వాల్‌పై రాసిన వాఖ్యలపై ఔట్‌లుక్ మ్యాగజైన్‌ సంజాయిషీ ఇవ్వాలంటూ పీసీఐ నోటీసులు జారీ చేసింది.

కాగా, స్మితా సబర్వాల్‌పై అనుచిత వాఖ్యలు రాసిన ఔట్‌లుక్ మ్యాగజైన్‌పై చర్యలు తీసుకోవాలంటూ జనార్థన్‌గౌడ్ అనే న్యాయవాది పీసీఐని సంప్రదించారు. ఈమేరకు పీసీఐ స్పందించింది. స్మిత సబర్వాల్‌పై ఔట్‌లుక్ మ్యాగజైన్ అనుచితమైన వ్యంగ్య కథనాన్ని ప్రచురించిందనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

PCI serves notice to Outlook on Smitha Sabharwal issue

సలహాదారులకు కేబినెట్ హోదాపై విచారణ

ప్రభుత్వ సలహాదారులకు తెలంగాణ ప్రభుత్వం కాబినెట్ హోదా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నల్గొండ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు.

పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి

ఆదిలాబాద్ జిల్లాలోని జెన్నారం మండలం ధర్మారంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదం అలముకుంది.

English summary
Press Council of India has served notice to PUlook magazine on Telangana IAS officer Smitha Sabharwal issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X