హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజా సింగ్‌పై పీడీ యాక్ట్: తీర్పు రిజర్వు చేసిన పీడీ చట్టం సలహా మండలి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ వ్యవహారంలో సమీక్ష గురువారం జరిగింది. పీడీ చట్టం సలహా మండలి సమావేశమై ఈ కేసును సమీక్షించారు. బేగంపేటలోని గ్రీన్‌ల్యాండ్‌ అతిథి గృహంలో సమావేశమైన సలహా మండలి.. దీనిపై విచారణ నిర్వహించింది.

రాజాసింగ్‌పై పీడీ చట్టం నమోదు చేయడానికి గల కారణాలు, ఆధారాలను మంగళ్‌హాట్ పోలీసులు ఇప్పటికే పీడీ చట్టం సలహా మండలికి అందించారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజాసింగ్... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు.

 pd act case against mla rajasingh: pd act advisory board reserved judgment

రాజాసింగ్ భార్య ఉషాబాయి, ఆయన తరఫు న్యాయవాది కూడా సలహా మండలి ఎదుట హాజరయ్యారు.ఈ సందర్భంగా తనపై అక్రమంగా పీడీ చట్టం నమోదు చేసినట్టు రాజాసింగ్‌ సలహా మండలికి తన వాదనలు వినిపించారు. వాదనలు విన్న పీడీ చట్టం సలహా మండలి తీర్పును వాయిదా వేసింది.

మూడు, నాలుగు వారాల్లో మండలి తీర్పు వెల్లడించే అవకాశం ఉందని రాజాసింగ్‌ తరఫు న్యాయవాది కరుణాసాగర్‌ తెలిపారు. మరోవైపు, రాజాసింగ్‌ సతీమణి ఉషాబాయి కూడా ఈ విషయంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కాగా, ఎమ్మెల్యే రాజాసింగ్ ను ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద పోలీసులు ఆగస్టు 25న అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. పీడీ యాక్ట్ కు సంబధించి 32 పేజీల డ్యాక్యుమెంట్‌ను పోలీసులు రాజాసింగ్‌కు ఇచ్చారు. దేశవ్యాప్తంగా 101 కేసులు నమోదయ్యాయని.. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా రాజాసింగ్ వ్యాఖ్యలు వున్నాయని పేర్కొన్నారు.

English summary
pd act case against mla rajasingh: pd act advisory board reserved judgment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X