వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయరామ్ హత్య కేసు .. రాకేష్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు .. సంవత్సరం నో బెయిల్

|
Google Oneindia TeluguNews

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీలో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి పై పీడీయాక్ట్ నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. చిగురుపాటి రాకేష్ రెడ్డిపై శుక్రవారం పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడికి బెయిల్ లేకుండా చేశారు. ఏడాది దాకా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా, బెయిల్ రాకుండా పీడీ యాక్ట్ పెట్టారు పోలీసులు.

డబ్బు కోసం అతి కిరాతకంగా పారిశ్రామికవేత్త జయరాం ను హతమార్చి కార్ యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు రాకేష్ రెడ్డి. ఈ హత్యా కేసులో పోలీసుల , రాజకీయ నాయకుల, సినీ పరిశ్రమకు చెందిన ఓ ఆర్టిస్ట్ సహాయం తీసుకున్న రాకేష్ రెడ్డి నేరాల చిట్టా విప్పిన పోలీసులు అతను బయట సమాజంలో ఉంటె ప్రమాదం అని భావించి అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కటకటాల పాలు చేశారు. ప్రస్తుతం రాకష్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్నాడు.

PD Act invoked on Rakesh Reddy, the murderer of industrialist Jayaram

మొదట అందరూ ఈ హత్యకేసులో శిఖా చౌదరి పాత్ర ఉందని భావించారు. జయరాం భార్య సైతం శిఖా చౌదరిపై అనుమానాలు వ్యక్తం చేసింది. కానీ అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నిందితురాలు అంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన మేనకోడలు శిఖా చౌదరికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆమె ప్రమేయం ఏం మాహ్రం లేదని తేల్చేశారు. ఇక రాకేష్ రెడ్డి విషయంలోనే కఠిన నిర్ణయం తీసుకుని పీడీ యాక్ట్ నమోదు చేశారు.

English summary
The BanjaraHills police on Friday invoked PD Act on Rakesh Reddy, the prime accused in the murder case of NRI Industrialist Chigurupati Jayaram. With the invoke of PD Act, the accused has to be behind the bars for one year and he will not have the chance of any bail to release from the jail. Presently the accused is in the Chenchalguda jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X