హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్నేక్‍గ్యాంగ్‌పై పీడీ యాక్ట్ అమలు: సివి ఆనంద్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పహాడీషరీఫ్ స్నేక్ గ్యాంగ్‌లోని ఇద్దరు నిందితులపై పీడీ చట్టం అమలు అవుతుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మహ్మద్ ఇసాక్, సయ్యద్ బసలామాలపై పీడీ చట్టం పెట్టినట్లు చెప్పారు.

స్నేక్‌గ్యాంగ్ నిందితులు కొద్ది నెలల క్రితం పాములతో బెదిరింపులకు గురిచేసి యువతులపై అత్యాచారాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. స్నేక్ గ్యాంగ్ అరాచకాలు పెరిగిపోవడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

 pd act on snake gang

ఉప్పల్‌లో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం

హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైయ్యారు. ట్యూషన్‌కు వెళ్లిన వాసవి, జానకి అనే విద్యార్థినులు ఇంటికి తిరిగి రాలేదు. బాలికల ఆచూకీ కోసం తల్లిదండ్రులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆందోళనచెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విద్యార్థినుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

హరిహరపురం కాలనీలో దొంగ అరెస్టు

హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం హరిహరపురం కాలనీలో పోలీసులు ఓ దొంగను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ. 65 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బంగారం కుదువ పెట్టుకున్న ముగ్గురు స్వర్ణకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Cyberabad commissioner CV Anand on Thursday said that pd act executing on snake gang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X