హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహ్‌గిరి జోష్: రోడ్డుపై ఆడిపాడిన యువత(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో నిర్వహించిన రాహ్‌గిరి ఉత్సాహంగా సాగింది. ఆటపాటలు కలబోసిన ఆదివారాన్ని ఆనందంగా గడిపారు. కాంక్రిట్ జంగిల్‌లో నాలుగుగోడలకే పరిమితమైన జీవితాలు రెట్టించిన ఉత్సాహంతో రహదారిపై అడ్డూఅదుపు లేకుండా విహరించాయి. కేరింతలు కొడుతూ... గెంతులు వేస్తూ ఉత్సాహంగా గడిపారు.

ఆదివారం మొదటిసారిగా బయోడైవర్సిటీ పార్క్ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు ఏర్పాటు చేసిన రాహ్‌గిరిలో సుమారు 3వేల మంది పాల్గొని ఆనందంగా గడిపారు. ఎంట్రీ ఫీజు లేకుండా ఈ హ్యాపీ అడ్డాలో అడుగుపెడితే చాలు బాడుగ సైకిల్ చేతికొస్తుంది. నచ్చితే సాకర్ ఆడుకొమ్మని కోకాకోలా ఆహ్వానిస్తే.. అది నచ్చకపోతే.. పాటుందంటూ జుంబా డ్యాన్సర్ల పిలుపుతో డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడిపారు.

రీబాక్ యోగా తరగతులు, రాక్ బ్యాండ్ సంగీత హోరు, ప్రతిభకు పదును పెట్టే క్విజ్, ఒక్కటేమిటి ఈ రాహ్‌గిరిలో చూడని వినోదం లేదు. హుషారెత్తించే ఎరోబిక్స్ నుంచి మార్షల్ ఆర్ట్స్ వరకు శరీరాన్ని విల్లులా వంచే ఫిట్‌నెస్ యాక్టివిటీస్, దేహాన్ని ఆయుధంలో మలచే మార్షల్ ఆర్ట్సే కాదు. పెద్దలకు జుంబా ఆటల తుళ్లింతలు, పిల్లలకు గాలి పటాల కేరింతలు. పెయింటింగ్, స్కేటింగ్, రన్నింగ్, సైక్లింగ్, షటిల్ ఇలా ఎన్నో ఆటలు, మరెన్నో కళలు ప్రదర్శిస్తూ పిల్లలు, పెద్దలు సందడి చేశారు.

రాహ్‌గిరి

రాహ్‌గిరి

నగరంలో నిర్వహించిన రాహ్‌గిరి ఉత్సాహంగా సాగింది. ఆటపాటలు కలబోసిన ఆదివారాన్ని ఆనందంగా గడిపారు.

రాహ్‌గిరి

రాహ్‌గిరి



కాంక్రిట్ జంగిల్‌లో నాలుగుగోడలకే పరిమితమైన జీవితాలు రెట్టించిన ఉత్సాహంతో రహదారిపై అడ్డూఅదుపు లేకుండా విహరించాయి. కేరింతలు కొడుతూ... గెంతులు వేస్తూ ఉత్సాహంగా గడిపారు.

రాహ్‌గిరి

రాహ్‌గిరి

ఆదివారం మొదటిసారిగా బయోడైవర్సిటీ పార్క్ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు ఏర్పాటు చేసిన రాహ్‌గిరిలో సుమారు 3వేల మంది పాల్గొని ఆనందంగా గడిపారు.

రాహ్‌గిరి

రాహ్‌గిరి

ఎంట్రీ ఫీజు లేకుండా ఈ హ్యాపీ అడ్డాలో అడుగుపెడితే చాలు బాడుగ సైకిల్ చేతికొస్తుంది.

రాహ్‌గిరి

రాహ్‌గిరి

నచ్చితే సాకర్ ఆడుకొమ్మని కోకాకోలా ఆహ్వానిస్తే.. అది నచ్చకపోతే.. పాటుందంటూ జుంబా డ్యాన్సర్ల పిలుపు.. ఓపికుంటే మా తోపాటూ స్టెప్పులేయాలంటూ పిలిచే అమ్మాయిలతో కాలు కదుపొచ్చు.

రాహ్‌గిరి

రాహ్‌గిరి

రీబాక్ యోగా తరగతులు, రాక్ బ్యాండ్ సంగీత హోరు, ప్రతిభకు పదును పెట్టే క్విజ్, ఒక్కటేమిటి ఈ రాహ్‌గిరిలో చూడని వినోదం లేదు.

రాహ్‌గిరి

రాహ్‌గిరి

హుషారెత్తించే ఎరోబిక్స్ నుంచి గగుర్పాటు కలిగించే మార్షల్ ఆర్ట్స్ వరకు శరీరాన్ని విల్లులా వంచే ఫిట్‌నెస్ యాక్టివిటీస్, దేహాన్ని ఆయుధంలో మలచే మార్షల్ ఆర్ట్సే కాదు. పెద్దలకు జుంబా ఆటల తుళ్లింతలు, పిల్లలకు గాలి పటాల కేరింతలు.

రాహ్‌గిరి

రాహ్‌గిరి

సందట్లో సండేమియాలో స్ట్రీట్ థియేటర్‌పై యంగ్ బ్యాండ్స్ మోత. యంగ్ ఏజ్.. గల్లీ క్రికెట్‌లో మునిగి తేలుతుంటే లిటిల్ ఏజ్ మాత్రం స్టోరీ టెల్లింగ్‌లో లీనమైపోయింది.

రాహ్‌గిరి

రాహ్‌గిరి

పెయింటింగ్, స్కేటింగ్, రన్నింగ్, సైక్లింగ్, షటిల్ ఇలా ఎన్నో ఆటలు, మరెన్నో కళలు ప్రదర్శిస్తూ పిల్లలు, పెద్దలు సందడి చేశారు.

రాహ్‌గిరి

రాహ్‌గిరి

కొలంబియాలోని బొగోటా 1976లో ప్రారంభమైన ఈ స్ట్రీట్ ఈవెంట్‌ను రాహ్‌గిరి పేరుతో దేశంలో గుర్‌గావ్‌లో తొలిసారిగా నిర్వహించారు.

రాహ్‌గిరి

రాహ్‌గిరి

ప్రస్తుతం ఢిల్లీ, ఇండోర్, అహ్మదాబాద్ నగరాలకూ విస్తరించిన ఈ ట్రెండ్ దక్షిణ భారత దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ఆదివారం అడుగుపెట్టింది.

రాహ్‌గిరి

రాహ్‌గిరి

గచ్చిబౌలిలోపి బయో డైవర్సిటీ పార్క్ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు రహదారిపై 1.9 కిలోమీటర్లు పొడవున అధికారులు రోడ్డుపై వాహనాలకు ప్రవేశం లేకుండా కేవలం హ్యాపీ హ్యాపెనింగ్‌కే అనుమతించారు.

రాహ్‌గిరి

రాహ్‌గిరి

దీంతో ఉదయం 6 గంటల నుంచి 10:30 గంటల మధ్య నచ్చిన కార్యక్రమంలో జాయిన్ అవుతూ నగరవాసులు హ్యాపీగా గడిపారు.

రాహ్‌గిరి

రాహ్‌గిరి

టిఎస్‌ఐఐసీ, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, ఎంబార్క్, ఐడెంట్‌సిటీ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక సంస్థల ఉద్యోగులు, పెద్దలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

English summary
A busy stretch in Madhapur was a picture of surprise on Sunday. Hundreds of citizens shook a leg, flew kites, sang, performed skits and played cricket bang in the middle of the road and all this without a single motor vehicle in sight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X