వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు దారుసలాం పాలన వద్దు...లాల్ దర్వాజా పాలన కావాలి: స్వామి పరిపూర్ణానంద

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో దారుసలాం పాలన జరుగుతోందని...లాల్ దర్వాజా పాలన జరగాలని బీజేపీ నేత ప్రముఖ స్వామీజీ పరిపూర్ణానంద స్వామి అన్నారు. హిందుస్థాన్‌లో హిందువులకు చోటు లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు.తెలంగాణలో అలాంటివే రెండు కూటములు ఏర్పడ్డాయని చెప్పారు. మజ్లిస్‌తో కూడిన టీఆర్ఎస్ పార్టీ, టీడీపీతో కలిసిన కాంగ్రెస్ కూటమిలు కలిసి రాష్ట్రాన్ని అదోగతికి గురిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జీసస్ పాలన తీసుకొస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను స్వామి పరిపూర్ణానంద తీవ్రంగా ఖండించారు. ఇక కేసీఆర్ తన పాలనతో మళ్లీ నాటి నిజాం పాలన గుర్తుకు తీసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు స్వామి పరిపూర్ణానంద.

ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు

ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు

వరంగల్‌లో సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న వృద్ధ పూజారిపై ఓ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి విచక్షణారహితంగా కొట్టి చంపారని... అదేమని ప్రశ్నిస్తే ఆవ్యక్తి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని చెబుతున్నారని పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఎలాంటి సమాజంలో బతుకుతున్నామని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు కోసం నేతలు రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. కేసీఆర్ పాలనలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని పరిపూర్ణానంద మండిపడ్డారు.

దారుసలేం పాలన వద్దు... లాల్ దర్వాజ పాలన కావాలి

దారుసలేం పాలన వద్దు... లాల్ దర్వాజ పాలన కావాలి


మైనార్టీ రక్షణ కోసం పనిచేయడం కాదు... మెజార్టీ ప్రజల రక్షణ కోసం పనిచేయాలని ఇందుకోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. దారుసలేం కనుసన్నలలోనుంచి బయటకు రావాలని చెప్పిన పరిపూర్ణానంద లాల్ దర్వాజా కనుసన్నులలో పాలన జరగాలని కోరారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీల పొట్టను కొడుతారా అని ప్రభుత్వాన్ని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పిన పరిపూర్ణానంద స్వామి డిసెంబర్ 7న మనసుతో ఓటు వేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు.

 నేనే తెలంగాణ సీఎం అభ్యర్థి

నేనే తెలంగాణ సీఎం అభ్యర్థి

తన గొంతు ప్రజలకు వినిపించేందుకే బీజేపీని ఎంచుకున్నట్లు స్వామి పరిపూర్ణానంద తెలిపారు. సీఎం అభ్యర్థి పరిపూర్ణానంద అని అంటున్నారని తను నిజంగానే సీఎం అభ్యర్థిని అని తెలిపారు. అయితే దీనికి బాష్యం మరోలా వివరించారు స్వామీజీ. తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెప్పారు. తన కోసం 500 మంది పోలీసులను, 30 పెట్రోలింగ్ వాహనాలను పెట్టారని అంత ఖర్చు పెట్టడం అవసరమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దారుసలాంకే సలాం కొడుతూ మెజార్టీ ప్రజలను విస్మరిస్తోందని చెప్పారు.

 నా ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారు

నా ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారు

రానున్న ఎన్నికల్లో ప్రజలకు బీజేపీనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని జోస్యం చెప్పారు పరిపూర్ణానంద స్వామి. ఇప్పుడు హిందూ ఆలయాల్లో మైక్ శబ్దం వినపడితే కొడుతున్నారని చెప్పిన పరిపూర్ణానంద స్వామి... కొన్ని రోజుల తర్వాత ఇంట్లో గంట శబ్దం వినపడితే కత్తులతో దాడులు చేస్తారని చెప్పారు. మరోవైపు భవిష్యత్తులో తన కార్యాచరణ గురించి వివరిస్తానని చెప్పిన పరిపూర్ణానంద తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తోందని ఇప్పటికే కాంగ్రెస్ టీడీపీ వారు ధ్వజమెత్తారు. ఈ మధ్యనే తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాం కూడా తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా స్వామి పరిపూర్ణానంద కూడా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది.

English summary
Telangana politics are on a boil with all the opposition parties attacking the KCR govt. In a fresh incident BJP leader and spiritual guru Swami paripurnananda fired on govt policies. He alleged that KCR is reminding of the cruel nizams administration.swamiji also said that people doesn't require Daru salam administration and are looking for Ladarwaza administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X