వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్సింగ్‌లపై అసత్య ప్రచారాన్ని నమ్మద్దు.. తెలంగాణ డీజీపీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో జరుగుతున్న మిస్సింగ్‌లపై ప్రజలు ఆందోళన పడవద్దని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఈనేపథ్యంలోనే రాష్ట్రంలో మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో తప్పిపోతున్నారంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన చెప్పారు.మిస్సింగ్‌ కేసుల్లో చాలా వరకు కుటుంబ, ప్రేమ వ్యవహారం, పరీక్షలు తప్పడం వంటి వివిధ కారణాలతో ఇంటిని విడిచి వెళ్తున్నట్లు చెప్పారు.నమోదైన అన్ని కేసుల్లో 85 శాతానికి పైగా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు.

మిగిలిన కేసుల పరిష్కారానికి పోలీస్ శాఖ ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. సమాజంలో అందరి భద్రతకు పోలీసులు కట్టుపడి ఉన్నారని అన్నారు. ప్రజల్లో భయాందోళనలను సృష్టించే విధంగా ఎవరైనా పుకార్లను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపింపచేయవద్దన్నారు. అలా ఎవరైనా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.ఇక రాష్ట్ర్ర వ్యాప్తంగా తప్పిపోయిన పిల్లలకోసం ఆపరేషన్ స్మైల్ పేరుతో ప్రత్యేక విభాగాలు పని చేస్తున్నాయని తెలిపారు.

people should not be worried about the missing :said DGP Mahender Reddy

కాగా తెలంగాణలో కోద్దిరోజుల్లోనే వందలాదీ మంది చిన్నపిల్లల నుండి, పెద్దవాళ్లవరకు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయంటూ వార్త పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో దావానంలో వ్యాపిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే పోలీస్ స్పందించారు. మిస్సింగ్‌లపై క్లారీటి ఇచ్చే ప్రయత్నం చేశారు.

English summary
DGP Mahender Reddy said people should not be worried about the missing going on in Telangana. He said that a large number of women, children and adults missing.and they are leaving the house for various reasons as family, love affairs.even though More than 85 percent of cases have been solved in all cases.he said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X