హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి క్వారంటైన్‌లో కలకలం: తప్పు కాదు గానీ.. సోషల్ డిస్టెన్సింగ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. అనూహ్యంగా పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పట్లో ఆగేలా లేనివిధంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానిస్తోన్న వారందర్నీ ప్రభుత్వం క్వారంటైన్లకు తరలిస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి క్వారంటైన్‌లో కరోనా అనుమానితులు పెద్దసంఖ్యలో చేరుతున్నారు.

వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండటానికి సామాజిక దూరాన్ని పాటించాల్సి ఉన్నప్పటికీ.. దాన్ని పట్టించుకోవట్లేదు క్వారంటైన్‌లో ఉన్నవారు. సామాజిక దూరాన్ని పాటించకుండా.. పక్క పక్కనే నిల్చుని నమాజ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంప్రదాయాన్ని గౌరవిస్తూ.. నమాజ్ చేయడాన్ని ఎవరూ తప్పు పట్టనప్పటికీ.. సోషల్ డిస్టెన్స్‌ను పాటించి ఉండాల్సిందేనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

People under quarantine at Gandhi Hospital in Hyderabad, offering namaaz without social distancing

Recommended Video

Erragadda Mental Hospital Filled With Cases Of Alcohol Addiction

ఇదే అభిప్రాయాన్ని గాంధీ ఆసుపత్రిలోని క్వారంటైన్, ఐసొలేషన్ కేంద్రాల్లో ఉన్న కరోనా వైరస్ పేషెంట్లు వెల్లడిస్తున్నారు. నమాజ్ చేసే సమయంలో వైరస్ అనుమానితులు సామాజిక దూరాన్ని పాటించేలా ఆసుపత్రి సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సామాజిక దూరాన్ని పాటించడం వల్ల కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కూడా ప్రకటించిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

English summary
Quarantine at Gandhi Hospital at Secunderabad in Hyderabad in Telangana, People who are under quarantine seen offering namaaz without practicing social distancing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X