హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ అంటే ఏమిటో తెలుస్తుంది: 'బలమైన టీఆర్ఎస్సే ప్రజల అభీష్టం' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన సందర్భంగా వారందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ''రాజకీయ పునరేకీకరణ జరగాలి. అప్పుడే దేశానికి తెలంగాణ అంటే ఏమిటో తెలుస్తుంది. ఇది దేశానికి అర్థమయ్యేలాగానే ఇప్పుడు పని చేస్తున్నాం'' అని అన్నారు. తెలంగాణను నిలబెట్టుకోవాలంటే గట్టి పని తలపెట్టాలని నేతలకు సూచించారు.

''ఉద్యమ సమయంలో పార్టీలకతీతంగా పోరాడదామని పిలుపు ఇచ్చాను. అదే స్ఫూర్తితో ఇతర పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారు'' అని తెలిపారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, రాబోయే రోజుల్లో జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.

త్వరలో మథిర నియోజకవర్గంలో తాను పర్యటిస్తానని చెప్పారు. టీఆర్‌ఎస్‌ బలోపేతాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, పాలేరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తుమ్మలను గెలుపే అందుకు నిదర్శనమన్నారు. కరువు ప్రాంతమైన ఖమ్మం జిల్లా పట్ల గత ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించాయన్నారు.

దీని ఫలితంలాగనే ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే జిల్లాకు పలు ప్రాజెక్టులను మంజూరు చేసి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళిక రూపొందించిందన్నారు. మూడేళ్లలో సాగునీరు, తాగునీరు అందించేందుకు శాయశక్తులా కృషిచేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

బలమైన టీఆర్ఎస్సే ప్రజల అభీష్టం

బలమైన టీఆర్ఎస్సే ప్రజల అభీష్టం

ఖమ్మం జిల్లా పట్ల ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూపుతున్న శ్రద్ధను సీఎం కేసీఆర్ అభినందించారు. సాధించుకున్న తెలంగాణను నిలబెట్టుకోవడానికి రాజకీయ పునరేకీకరణ జరగాలన్నారు. స్వరాష్ట్రంగా తెలంగాణ ఇపుడు ప్రత్యేక రాజకీయ సందర్భంలో ఉందని, భావితరాల కోసం రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో నూతన పంథాలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

బలమైన టీఆర్ఎస్సే ప్రజల అభీష్టం

బలమైన టీఆర్ఎస్సే ప్రజల అభీష్టం

టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారనే విషయం ఇటీవల జరిగిన ఎన్నికల్లో రుజువైందని అన్నారు. తెలంగాణకు సంబంధించి నడిచిన చరిత్ర, నడుస్తున్న చరిత్రను గత కొద్దిరోజులుగా ప్రత్యేక ఇంటర్వ్యూలతో మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్న సంగతిని ఆయన వివరించారు.

బలమైన టీఆర్ఎస్సే ప్రజల అభీష్టం

బలమైన టీఆర్ఎస్సే ప్రజల అభీష్టం

తెలంగాణ రాజకీయ ఆలోచనా సరళి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు ప్రస్ఫుటం చేశాయని, ఆంధ్ర సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావును గెలిపించిన తీరే అందుకు నిదర్శనమన్నారు. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా నిలువనున్నదన్నారు.

బలమైన టీఆర్ఎస్సే ప్రజల అభీష్టం

బలమైన టీఆర్ఎస్సే ప్రజల అభీష్టం

మంత్రి తుమ్మలకునా అండదండలు అందిస్తూ పరస్పరం సహకారంతో జిల్లా నాయకత్వం ముందుకు సాగాలని సూచించారు.త్వరలో మధిర నియోజకవర్గ పర్యటనకు వస్తానని, అపుడు మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చేపట్టవలసిన కార్యాచరణపై చర్చిద్దామని హామీ ఇచ్చారు.

బలమైన టీఆర్ఎస్సే ప్రజల అభీష్టం

బలమైన టీఆర్ఎస్సే ప్రజల అభీష్టం

ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, జలగం వెంకటరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ, సీపీఎంలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీ, కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. మధిర జెడ్పీటీసీ మూడ్ ప్రియాంక, ఎంపీపీ దాసరి సామ్రాజ్యం, పద్మావతి, ఎం వినయ్‌కుమార్, సామినేని అప్పారావు, లేళ్ల వెంకట్‌రెడ్డి తదితరులకు కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

English summary
Chief Minister K Chandrashekar Rao on Friday said that the people of Telangana wanted the Telangana Rashtra Samithi (TRS) to become stronger so that it can achieve golden Telangana at a faster pace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X