హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహాకూటమి కాదు.. ప్రజా ఫ్రంట్, కన్వీనర్‌గా కోదండరాం, పీపుల్స్ మేనిఫెస్టో విడుదల

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రజా కూటమి లేదా మహా కూటమి సోమవారం సాయంత్రం పీపుల్స్ మేనిఫెస్టోను విడుదల చేసింది. అవినీతి నిర్మూలనపై ప్రధానంగా దృష్టి సారిస్తామని పేర్కొంది. ప్రజా కూటమి లేదా మహా కూటమికి ప్రజా ఫ్రంట్‌గా నామకరణం చేశారు. ఈ ఫ్రంట్‌కు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కన్వీనర్‌గా ఉంటారు.

<strong>బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు, కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరో చెప్పారు!</strong>బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు, కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరో చెప్పారు!

మేనిఫెస్టో విడుదల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తమది ప్రజా ఫ్రంట్ అన్నారు. అన్ని పార్టీలు ఒప్పుకున్న అజెండాను పెట్టామని చెప్పారు. తమది మహా కూటమి కాదని, ప్రజా ఫ్రంట్ అన్నారు. ఈ మేనిఫెస్టోకు అన్ని పార్టీలు అంగీకరించాయని చెప్పారు. వృద్ధులు, చేనేత, వితంతువులకు పింఛన్ పెంచుతామన్నారు.

Peoples manifesto released, Mahakutami now Praja Front

సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. విస్మరించబడిన వర్గాలకు న్యాయం చేసేలా తమ అజెండా ఉంటుందని చెప్పారు.

ఉద్యమకారుల ఆకాంక్షలను మీ ముందు ఉంచామని కోదండరాం చెప్పారు. అవినీతిపాలనను అంతమొందించడం కూటమి లక్ష్యమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకుపాలనలో అవకాశం కల్పిస్తామని తెలిపారు. వ్యవసాయం, సంప్రదాయక వృత్తులను పెంచి పోషిస్తామన్నారు. ప్రజా ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

తొలిసారిగా ఎన్నికల ప్రణాళికకు కమిటీ వేసుకున్నామని సీపీఐ నేతలు చెప్పారు. ప్రజలకు జవాబుదారీతనం ఉంటుందని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు.

ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, వికలాంగులకు పింఛన్ రూ.1500 నుంచి రూ.3000లు పెంపు, పింఛన్ రూ.1000 నుంచి రూ.2వేలకు పెంపు తదితర పథకాలు ఉంటాయని చెప్పారు.

English summary
TPCC chief Uttam Kumar Reddy and TTDP chief L Ramana and TJS chief Kodandaram released peoples manifesto on Monday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X