వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియుడి మోజులో ఎంతకు దిగజారిందంటే!: అందరిముందు తలదించుకునేలా!(ఫోటోలు)

ఇంట్లోంచి తీసుకొచ్చిన డబ్బులు అయిపోవడంతో.. ప్రియుడి సలహా మేరకు పద్మ దొంగ అవతారమెత్తింది. హాస్టల్ మహిళల ఫోన్లు, బంగారు గొలుసులు దొంగలించడం అలవాటు చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: షికార్లకు అలవాటుపడిన ఓ వివాహిత దారుణంగా మోసపోయింది. ప్రేమగా చూసుకునే భర్తను, కడుపున పుట్టిన బిడ్డలను సైతం కాదనుకుని వచ్చేస్తే.. ప్రియుడు ఆమెను వంచించాడు. ఆఖరికి ప్రియుడి కోసం దొంగ గాను మారి.. ప్రస్తుతం అందరి ముందు తలదించుకుని నిలబడింది.

గతంలోను రెండు, మూడుసార్లు ఇల్లు వదిలి పారిపోయినా.. ఆమె భర్త సర్దుకుపోయాడు. కానీ పదేపదే ఆమె అలానే వ్యవహరించడంతో కుటుంబం కూడా పట్టించుకోలేదు. బయటకొచ్చి ఎంత తప్పు చేశానో అర్థమయ్యే సరికి ఇప్పుడామె జీవితం ఎటూ కాకుండా పోయిన పరిస్థితి.

నిజామాబాద్ పద్మ:

నిజామాబాద్ పద్మ:

నిజామాబాద్‌కు చెందిన కె.పద్మ(29) షికార్లకు బాగా అలవాటు పడింది. ఇంట్లోంచి పారిపోయి కొద్దిరోజులు ఎక్కడెక్కడో తిరిగేది. కుటుంబ సభ్యులు పోలీసుల సహాయంతో తిరిగి ఆమెను ఇంటికి తీసుకొచ్చేవారు. కానీ ఆమె ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు సరికదా.. కె.పవన్ కుమార్(23) అనే యువకుడితో ఇటీవల ప్రేమ వ్యవహారం మొదలుపెట్టింది.

పవన్ తో కలిసి పారిపోయి:

పవన్ తో కలిసి పారిపోయి:

తాము నివాసముండే ప్రాంతంలోనే పవన్ ఉంటుండటంతో పద్మకు అతనితో సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసి.. ఇద్దరూ ఇంట్లోంచి పారిపోయే దాకా వచ్చింది. ఇంట్లోంచి రూ.40వేల డబ్బు తీసుకుని పద్మ అతనితో పాటు హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడికొచ్చాక.. ప్రియుడు ఆమెను దిల్‌సుఖ్‌నగర్ లోని ఓ లేడీస్ హాస్టల్స్ లో పెట్టాడు. ఇదే క్రమంలో ఇంట్లోంచి తీసుకొచ్చిన డబ్బులు అయిపోవడంతో అసలు కథ మొదలైంది.

దొంగగా మారి:

దొంగగా మారి:

ఇంట్లోంచి తీసుకొచ్చిన డబ్బులు అయిపోవడంతో.. ప్రియుడి సలహా మేరకు పద్మ దొంగ అవతారమెత్తింది. హాస్టల్ మహిళల ఫోన్లు, బంగారు గొలుసులు దొంగలించడం అలవాటు చేసుకుంది. ఇటీవల కొంతమంది హాస్టల్ మహిళలు మలక్ పేట పోలీస్ స్టేషన్ లో వరుస చోరీలపై ఫిర్యాదు చేశారు. దీంతో పద్మ కదలికలపై అనుమానం వచ్చి.. ఆమె మీద నిఘా పెట్టారు.

నిజం ఒప్పుకుంది:

నిజం ఒప్పుకుంది:

పద్మను అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే చోరీలకు పాల్పడినట్లు అంగీకరించింది. ప్రియుడు పవన్ బలవంతం మేరకే తానలా దొంగతనాలకు పాల్పడాల్సి వచ్చిందని కంటతడి పెట్టుకుంది. నిందితుల నుంచి 3 సెల్‌ఫోన్లు, ఆరు గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మనసును అదుపులో పెట్టుకుని, పరిస్థితులకు తగ్గట్లు హుందాగా వ్యవహారించాల్సింది పోయి.. చేజేతులా పద్మ తన జీవితాన్ని నాశనం చేసుకుంది.

English summary
A married woman was arrested by Malakpet police in Hyderabad for stealing cell phones from a hostel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X