తుపాకీ గురిపెట్టి చంపుతానంటూ ఎస్ ఐ బెదిరింపు, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఎస్ ఐ రౌడీగా వ్యవహరించాడు. సివిల్ తగాదాలో తలదూర్చి రియల్టర్ ను చంపుతానని గన్ తో బెదిరించాడు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి సిబ్బందితో కలిసి చితకబాదాడు. పత్రాలివ్వకుంటే అంతుచూస్తానని బెదిరించాడు.

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన పదిరోజుల క్రితం చోటుచేసుకొంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గచ్ఛిబౌలికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శివప్రసాద్ సోమవారం నాడు సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్యకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసును బాలానగర్ డీసీపీ సాయి శేఖర్ కు అప్పగించారు.

Pet Basheerabad SI threatened man with gun

శివప్రసాద్, రవీంద్ర ప్రసాద్ లు రియల్ ఏస్టేట్ వ్యాపారులు. ఇద్దరికీ రెండేళ్ళుగా పరిచయం ఉంది. ఏడాది క్రితం రవీంద్ర ప్రసాద్ కు శివప్రసాద్ రూ.75 లక్షలు అప్పు ఇచ్చాడు. భూమి పత్రాలను హామీగా దగ్గర పెట్టుకొన్నాడు. ఇటీవల శివప్రసాద్ కు డబ్బు అవసరం కావడంతో తన సొమ్మును ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు.

రవీంద్ర ప్రసాద్ తొలుత రూ.4 లక్షలు ఇచ్చాడు. ఇంకా డబ్బులు కావాలని చెప్పడంతో సుచిత్ర దగ్గరున్న ఆసుపత్రికి రమ్మన్నాడు. బాధితుడు శివప్రసాద్ సుచిత్ర వద్దకు వెళ్ళగానే ఎస్ ఐ కోటేశ్వర్ రావు నలుగురు కానిస్టేబుళ్ళు బాధితుణ్ణి చుట్టుముట్టి నానా దుర్బాషలాడారు. ఎస్సె కోటేశ్వర్ రావు ఏకంగా తుపాకీ గురిపెట్టాడు.

భూమి పత్రాలు ఇవ్వకుంటే అంతు చూస్తానని బెదిరించాడు. బయట తిరగలేవని హెచ్చరించారు. డబ్బులిస్తేనే పత్రాలిస్తానని చెప్పినా వినకుండా స్టేషన్ కు తీసుకువచ్చి దారుణంగా కొట్టారు. పత్రాలు ఇవ్వకుంటే కోటింగ్ తప్పదని హెచ్చరించారు.

దిక్కుతోచని శివప్రసాద్ భూమి పత్రాలను వెనక్కి ఇచ్చాడు. ఈ ఘటనపై ప్నేహితుడి సహయంతో సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశాడు. సిబ్బందితో ఎస్సై కోటేశ్వర్ ావు కొట్టిస్తున్న సమయంలో ఫోన్లో రికార్డు చేసిన ఆడియో టేపులను బాధితుడు సీపీకి సమర్పించాడు. పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని సీపీ ఆదేశించారు. బాలానగర్ డీసీపి సాయిశేఖర్ బాధితుడు శివప్రసాద్ తో మాట్లాడి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. శివప్రసాద్ సోమవారం నాడు సాయంత్రం తాను దాడికి గురైన స్టేషన్ లోనే ఫిర్యాదు చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man complained with commissioner of police Sandip Sandilya against Pet Basheerabad SI Koteswara Rao. He complained that the SI has been involving in civil disputes and property settlement.
Please Wait while comments are loading...