హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాకప్ లో కొడుతూ ఫోన్ లో విన్పించాడు, ఎస్ ఐ కోటేశ్వర్ రావు అక్రమాలపై ఆరా...

పేట్ బషీరాబాద్ ఎస్ ఐ కోటేశ్వర్ రావు ఈ పేరు ఇటీవల కాలంలో అందరికీ సుపరిచితంగా మారింది. ఓ రియల్ ఏస్టేట్ వ్యాపారిని చితబాదిన ఘటనలో ఆయనను సస్పెన్షన్ కు గురయ్యాడు.అయితే ఈ ఒక్క ఘటనే కాదు ఇంకా అనేక ఘటనల్లో ఆ

By Narsimha
|
Google Oneindia TeluguNews

కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ ఎస్ ఐ కోటేశ్వర్ రావు ఈ పేరు ఇటీవల కాలంలో అందరికీ సుపరిచితంగా మారింది. ఓ రియల్ ఏస్టేట్ వ్యాపారిని చితబాదిన ఘటనలో ఆయనను సస్పెన్షన్ కు గురయ్యాడు.అయితే ఈ ఒక్క ఘటనే కాదు ఇంకా అనేక ఘటనల్లో ఆయన కీలకంగా వ్యవహరించాడని విచారణలో తేలింది.ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని ఆయన మోనార్క్ గా వ్యవహరించాడని పోలీసు శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు.

లాకప్ లో ఓ వ్యక్తిని చితకబాదుతూ ప్రత్యర్థికి లైవ్ లో వినిపించిన ఎస్ ఐ కోటేశ్వర్ రావు అక్రమాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనలో కోటేశ్వర్ రావుతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్ళు సస్పెన్షన్ కు గురయ్యారు.

Petbashirabad si Koteshwar Rao did somany illegal activities

కెపిహెచ్ బీ లోని హెచ్ ఎం టీ శాతవాహన కాలనీకి చెందిన శివప్రదీప్ తన స్నేహితుడు ద్వారా పరిచయమైన రవీంద్రప్రసాద్ అనే వ్యక్తికి విడతల వారీగా రూ.75 లక్షలను అప్పుగా ఇచ్చాడు.

ఈ విషయంలో ఎస్ ఐ కోటేశ్వర్ రావు జోక్యం చేసుకొని అప్పు తీసుకొన్న వ్యక్తికి మద్దతుగా శివప్రదదీప్ ను స్టేషన్ కు తీసుకువచ్చి ఇంటరాగేషన్ పేరుతో చితకబాదాడు.

ఈ విషయమై ఉన్నతాధికారులు ఒక వైపు విచారణ జరుపుతుండగానే గతంలో తన సెక్టార్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించిన వ్యక్తికి అండగా ఉన్నాడనే ఆరోపణలు కూడ వెలుగుచూశాయి.

పద్మానగర్ ఫేజ్ -2 వద్ద కాల్పుల కేసులో నిందితుడగా ఉండి హత్యకు గురైన చక్రవర్తి విషయంలోనూ ఎస్ ఐ కోటేశ్వర్ రావు వ్యవహరశైలి వివాదాస్పదంగా మారింది. కాల్పులు జరిపి పరారీలో ఉన్న చక్రవర్తి ఎస్ ఐ కోటేశ్వర్ రావు పోన్ లో మాట్లాడేవాడనే ఆరోపణలున్నాయి.

అంతేకాదు తన గురించి వెతకవద్దని తానే లొంగిపోతానని చక్రవర్తి స్వయంగా కోటేశ్వర్ రావుకు ఫోన్ చేసినట్టు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది.ఈ విషయమై మీడియాలో కథనాలు కూడ వచ్చాయి.

తాజా కేసులో శివప్రదీప్ అనే వ్యక్తిని లాకప్ లో హింసించిన ఎస్ ఐ కోటేశ్వర్ రావు ఫోన్ లో అతడి ఏడుపులను ప్రత్యర్థి అనిల్ కు లైవ్ లో విన్పించారని విచారణలో తెలిసింది.

ఈ విషయమై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనిల్ కుమార్ ను ఓ మంత్రి వద్ద పైరవీకారుడిగా గుర్తించారు. అనిల్ కు ,ఎస్ ఐ కోటేశ్వర్ రావుకు మధ్య సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఫోన్ లో మాట్లాడిన అనిల్ దొరికితే ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.

English summary
Petbashirabad si Koteshwar Rao did somany illegal activities from three years.Police officers enquired Koteshwar rao Illegal activities .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X