వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేప మందు పంపిణీ ఆపివేయాలని హైకోర్టులో పిటీషన్ .. గతంలోనూ వివాదాలు

|
Google Oneindia TeluguNews

బత్తిని సోదరుల చేప మందు పంపిణీ కు ముహుర్తం ఖరారైంది. ఈ మందును బత్తిని సోదరులు ఈనెల 8, 9 తేదీల్లో మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మందును చాలా మంది ప్రసాదంగా భావిస్తారు. దేని కోసం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వశారు. ముఖ్యంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఇది దివ్య ఔషధంగా చెప్తారు. ప్రతి యేటా మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. అయితే ఇప్పుడు చేప ప్రసాదం పంపిణీ ఆపాలని కోర్టులో పిల్ వేసింది బాలల హక్కుల సంఘం.

బాబాయి వై వి సుబ్బారెడ్డికి జగన్ గిఫ్ట్ అదిరిందిగా.. రాజ్య సభ ఎంపీగా అవకాశంబాబాయి వై వి సుబ్బారెడ్డికి జగన్ గిఫ్ట్ అదిరిందిగా.. రాజ్య సభ ఎంపీగా అవకాశం

చేప ప్రసాదం పంపిణీ నిలిపివేయాలని కోర్టు మెట్లెక్కిన బాలల హక్కుల సంఘం

చేప ప్రసాదం పంపిణీ నిలిపివేయాలని కోర్టు మెట్లెక్కిన బాలల హక్కుల సంఘం

ఉబ్బసం వ్యాధి నివారణకు అత్యద్భుత ఔషధమని గుర్తింపు పొంది దేశవ్యాప్తంగా ఉన్న రోగులను హైదరాబాద్‌కు వచ్చేలా చేస్తున్న చేపమందు పంపిణీని నిలిపి వేయాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలయ్యింది. అయితే ఈ మందు చట్ట వ్యతిరేకమని , ఎటువంటి శాస్త్రీయ నిర్థారణ దీనికి లేదని , ఇటువంటి మందు పంపిణీ చేయడం నిషేధించాలని బాలల హక్కుల సంఘం ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. లక్షల్లో తరలి వచ్చే రోగులకు చేప మందు పంపిణీ కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వ్యయం చేసి భారీ ఏర్పాట్లు చేస్తోందని , ఇటువంటి కార్యక్రమాలు ప్రజాధనాన్ని వృథా చేయడమేనన్నది వారి వాదన . అందువల్ల తక్షణం ఈ కార్యక్రమాన్ని నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు బాలల హక్కుల సంఘం నాయకులు .

చేప ప్రసాదం శాస్త్రీయతపై ఇప్పటికే పలు మార్లు వివాదాలు

చేప ప్రసాదం శాస్త్రీయతపై ఇప్పటికే పలు మార్లు వివాదాలు

చేప మందు పంపిణికి ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌ వాసులు బత్తిన సోదరులు ఇప్పటి వరకు ఈ చేప మందుపై అనేక సార్లు అనేక వివాదాలను ఎదుర్కొన్నారు. చేప ప్రసాదం శాస్త్రీయత పై అనేక వివాదాలు ఉన్నాయి.. అయినా చేప ప్రసాదానికి మాత్రం ఆదరణ తగ్గటం లేదు.. దీనికి అసలు శాస్త్రీయత లేదని చెబుతున్న జన విజ్ఙాన వేధిక గతంలో అనేకసార్లు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్ధానాన్ని ఆశ్రయించింది, ప్రతి యేటా మృగశిర కార్తె రోజున పంపిణీ చేసే చేప ప్రసాదంపై సిటీ సివిల్‌ కోర్టు 2012 లో తీర్పును వెలువరించింది. బత్తిన సోదరులు కూడా వారు పంపిణీ చేసే మిశ్రమాన్ని చేప ప్రసాదం అని వ్యవహరించటానికి అంగీకరించారు. చేప ప్రసాదం తయారీ, పంపిణీ అంతా పరిశుభ్రమైన వాతావరణంలో, వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో జర పాలని ఆదేశించింది. చేప ప్రసాదాన్ని ఎక్కడా చేప మందుగా ప్రచారం చేయరాదని, వీటిని ఉల్లంఘించిన పక్షంలో సర్కారు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. చేప ప్రసాదంలో కీలకంగా మారిన చేపలు పూర్తిగా శుభ్రమైన నీటిలోనే వుండాలని కూడా జడ్జి ఆదేశించారు.

తాజాగా లంచ్ మోషన్ పిటీషన్ వేసిన బాలల హక్కుల సంఘం .. కోర్టు ఏం చెప్తుందో అన్న ఆసక్తి

తాజాగా లంచ్ మోషన్ పిటీషన్ వేసిన బాలల హక్కుల సంఘం .. కోర్టు ఏం చెప్తుందో అన్న ఆసక్తి

చేప పిల్లలు తెచ్చే సమయం నుంచి పంపిణీ చేసే వరకు మంచి నీరు వుండాలని కూడా ఆదేశించారు. ఇక చేప ప్రసాదం పంపిణీ సమయంలో బత్తిన సోదరులు ప్రతిసారీ కచ్చితంగా చేతులు కడుక్కో వాలని, ఒకవేళ రోగులే స్వీకరిస్తే అవసరం లేదని జడ్జి పేర్కొన్నారు. పంపిణీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని, ఎక్కడా మందు అని వుండ రాదని, ఈ ఏర్పాట్లను బత్తిని సోదరులు స్వయంగా చేసుకోవాలని కూడా ఆదేశించారు. ఇక ఈ నేపధ్యంలోనే బత్తిని సోదరులు ప్రతియేటా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు మరోమారు తాజాగా చేప ప్రసాదంపై పిల్ వెయ్యటంతో చేప ప్రసాద పంపిణీ పై సదిగ్ధం నెలకొంది. ఇప్పుడు విచారణ జరగనున్న నేపధ్యంలో కోర్టు ఏం చెప్తుందో అన్న ఆసక్తి నెలకొంది.

English summary
A petition has been filed against the distribution of fish medicine in Hyderabad scheduled to happen on June 8 and 9. The Bathini brothers fish medicine is said to be the world-famous medicine for Asthma patients. Bathini brothers distribute the fish medicine every year in Hyderabad. Now, a lunch motion petition has been filed by the Child Rights Association in the high court. The petitioner mentioned that the distribution of fish medicine is illegal and there is no scientifical proof that it will cure Asthma. Government is wasting money on this programme, alleged petitioner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X