వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందే వెళ్తే.., మా వల్లే కేసీఆర్ పరుగు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: వర్షాలు పడక, కరెంట్‌ లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, ఏనాడు ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించని పరమ కర్కోటకుడు కేసీఆర్‌ అని టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి విమర్శించారు.

రైతు సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు టీడీపీ ఎంపీలు, ఎమ్మేల్యేలు చేపట్టిన బస్సుయాత్రలో శనివారం వరంగల్‌ జిల్లాలో పర్యటించారు.

హన్మకొండలోని ఏకశిల పార్క్‌నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రైతులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరనున్న ఎమ్మెల్యేలకు ప్యాకేజీని ఇవ్వడంలో చూపిన శ్రద్ధ రైతులకు కరెంట్‌ ఇవ్వడంలో చూపిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

నల్గొండ జిల్లాలో బస్సు యాత్ర సందర్భంగా కేసీఆర్‌ను తానేదో అన్నందుకు టీఆర్‌ఎస్‌ వాళ్ళు కోడిగుడ్లతో కొడతారంటున్నరని, దమ్ముంటే ఆ పని చేయమనండి.. గుడ్లు పీకి గోళీలాడుతామని టీడీపీ కార్యకర్తలు గుడ్లురిమితే వారి లాగులు తడుస్తయని హెచ్చరించారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేలు ఇళ్ళచుట్టు కాపలా కుక్కలా తిరుగుతున్నారని, ఈ పనేదో కేంద్రం కాళ్ళు పట్టుకుంటేనన్నా కరెంట్‌ వచ్చేదని రేవంత్‌ అన్నారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

మాజీ ఎమ్యేల్యే మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు రైతులకు చాలినంత కరెంట్‌ ఇస్తుండగా రూ.8వేల కోట్ల మిగులు బడ్జెట్‌ కలిగిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కరెంట్‌ ఇవ్వలేకపోతున్నాడని విమర్శించారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

ప్రభుత్వం మెడలు వంచైనా కరెంటు ఇప్పిస్తామని చెప్పారు. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. రైతులు సమస్యలపై తాము బస్సు యాత్ర చేపట్టగానే కేసీఆర్‌ గుండెల్లో గుబులు పుట్టిందన్నారు.

 బస్సుయాత్ర

బస్సుయాత్ర

మూడు నెలల పాటు ఇంట్లో పడుకున్న కేసీఆర్ హాడావుడిన ఢిల్లీకి ఉరికాడని ఎద్దేవా చేశారు. ఆదేదో ముందే చేసుంటే ప్రస్తుత పరిస్థితి ఉండేది కాదన్నారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలు కేసీఆర్‌ను ఉరికిచ్చి కొడ్తారని అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ఇచ్చే ప్యాకేజీలను కరెంట్‌ సరఫరాకు ఇస్తే రైతులకు మేలైనా జరిగేదని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ అన్నారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

కేసీర్‌ పాలన నచ్చితే నజరానా లేకుంటే జరిమాన చందంగా ఉందన్నారు రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ.. నాలుగున్నర నెల టీఆర్‌ఎస్‌ పాలనలో రైతులు పడుతున్న బాధలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రైతులకు 24 గంటల పాటు కరెంట్‌ ఇస్తామని చెప్పిన కేసీఆర్‌, పత్తి క్వింటాకు ఆరేడు వేల రూపాయలిప్పిస్తామని ప్రగల్భాలు పలికిన హరీశ్ రావు ఇప్పుడు ఎక్కడ పడుకున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్‌ను టీడీపీ బృందం సందర్శించిన సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

 బస్సుయాత్ర

బస్సుయాత్ర

తాము బస్సుయాత్ర చేస్తున్నామని తెలిసి హడావిడిగా మార్కెట్లలో సీసీఐ సెంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోళ్లు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

 బస్సుయాత్ర

బస్సుయాత్ర

రైతు సమస్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడ తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

 బస్సుయాత్ర

బస్సుయాత్ర

సీఎం కేసీఆర్‌కు రాష్ట్రంలో కరెంటు కొరత ఉంటుందన్న విషయం తెలియదా...? ఇన్ని రోజులు ఎక్కడ పన్నరు.. ఇప్పుడు నిద్ర లేచి కరెంటు కొనుగోలు చేస్తానని జోలెపట్టుకుని తిరిగితే దొరుకుతుందా.. పంటలు ఎండిపోయాక కరెంటు కొనుగోలు చేసి ఏం చేస్తారన్నారు.

 బస్సుయాత్ర

బస్సుయాత్ర

నిప్పులు చెరిగారు. ప్రభుత్వానికి చేతగాకపోతే కరెంటు బాధ్యత తమకు అప్పజెప్పాలని డిమాండ్‌ చేశారు. నెల రోజుల్లో రైతాంగానికి 9గంటల కరెంట్‌ ఇవ్వకపోతే టీడీపీ ఎమ్మెల్యేలంతా సన్యాసం తీసకుంటామని సవాల్‌ విసిరారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

మార్కెట్‌ను సందర్శించినవారిలో టీడీపీ నేతలు రమణ, గుండు సుధారాణి, మల్లారెడ్డి, గరికపాటి మోహన్‌రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, కిషన్ రెడ్డి, జి సాయన్న తదితరులు ఉన్నారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

టీ టీడీపీ బస్సుయాత్ర ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లాలో జరగనుందని పార్టీ మీడియా కమిటీ చైర్మన్‌ ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

English summary

 Photos of Telangana TDP leaders tear into TRS Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X