హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టేశారు: మహిళలను దడదడలాడించిన చైన్ స్నాచర్ల్ వీరే (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సైబరాబాద్, హైదరాబాద్ జంట కమిషనరేట్లతో పాటు మెదక్ జిల్లాలో ఒంటరి మహిళల మెడలో నుంచి మంగళసూత్రాలను లాక్కొని పరారవుతున్న అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్ ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ నలుగురిని అరెస్టు చేసి 19 కేసులు డిటెక్ట్ చేయగా సౌత్‌జోన్ పోలీసు ఇద్దరిని అరెస్టు చేసి 11 కేసులు డిటెక్ట్ చేశారు. 30 కేసులను ఛేదించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు కిలో బంగారు ఆభరణాలను రికవరీ చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి శుక్రవారంనాడు మీడియాకు వివరించారు. హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి ఔరంగాబాద్ వెళ్లిపోతుంటారు. పోలీసు నిఘా తగ్గిందని భావించినప్పుడు మళ్లీ నగరానికి వచ్చి తమ పాని కానిచ్చేస్తుంటారు.

స్నాచింగ్‌ల నివారణపై ప్రత్యేక దృష్టి

స్నాచింగ్‌ల నివారణ, జరిగిన ఘటనలలో నిందితులను పట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. స్నాచింగ్ ఘటనలు ఉపేక్షించరానివని, మహిళల మనోభావాలను ఈ ఘటనలు తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు. అందుకోసమే స్నాచర్లపై పీడీయాక్టు పెడుతున్నామన్నారు.

దేశంలో ఉండే స్నాచర్లందరిని పూర్తి సమాచారాన్ని సేకరించి డేటాబేస్ తయారు చేసి నిందితులను వెంటనే పట్టుకునేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా సంఘటన జరుగానే బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుంటారన్నారు. బాధితులు ఘటన జరిగిన వెంటనే 100 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని యంత్రాంగమంతా అప్రమత్తవుతుందన్నారు.

చైన్ స్నాచర్లు వీరే..

చైన్ స్నాచర్లు వీరే..

ఉప్పల్, ఫిర్జాదిగూడలో నివాసముండే మహ్మద్ రషీద్, మహరాష్ట్ర, ఔరంగాబాద్‌కు చెందిన మహ్మద్ సయ్యాద్ అలీ అలియాస్ షేక్ సయ్యిద్ అలీ, సయ్యిద్, షేక్ అర్షద్ అలీ అలియాస్ అర్షద్, నగరంలోని సోమాజిగూడ మక్తా ప్రాంతంలో నివాసముండే అఫ్రోజ్‌ఖాన్‌లు బంధువులు.

ఇలా చేస్తుంటారు..

ఇలా చేస్తుంటారు..

కొన్నాళ్లు హైదరాబాద్‌లో మరికొన్నాళ్లు ఔరంగాబాద్‌లో ముఠా సభ్యులు నివాసం ఉంటారని, నగరంలో ఉన్నప్పుడు స్నాచింగ్ ఘటనలకు పాల్పడి తిరిగి ఔరంగాబాద్ వెళ్తారని, ఇక్కడ పోలీసుల నిఘా తగ్గిందని భావించినప్పుడు తిరిగి నగరానికి వచ్చి పరిసర ప్రాంతాలలో స్నాచింగ్‌లు చేసి పరారవుతారని సిపి మహేందర్ రెడ్డి చెప్పారు.

సయ్యద్, రషీద్ ఇలా..

సయ్యద్, రషీద్ ఇలా..

ఇందులో రషీద్, సయ్యిద్ అలీలు పాత నేరస్థులు 2003 నుంచి వీరికి నేర చరిత్ర ఉంది, జంట కమిషనరేట్ల పరిధిలో పలు కేసులలో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చారు. సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు జైళ్లో పరిచయమయ్యారు.

సయ్యద్, రషీద్ బైక్‌లపై..

సయ్యద్, రషీద్ బైక్‌లపై..

సయ్యద్, రషీద్ బజాజ్ పల్సర్ 150 సీసీ, 180 సీసీ బైక్‌లను వాడుతారు. ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసి వారి మెడలో నుంచి మంగళసూత్రాలను లాక్కొని పరారవుతుంటారు. హైస్పీడ్ బైక్‌లో వేగంగా పరారవుతారు. జంట కమిషనరేట్ల పరిధిలో ఈ ముఠా 19 స్నాచింగ్ ఘటనలకు పాల్పడింది.

అయాన్ అలీ ఇలా..

అయాన్ అలీ ఇలా..

మహారాష్ట్రకు చెందిన మిల్ అయాన్ అలీ అలియాస్ అయాన్ 2011లో సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడడంతో అరెస్టు చేసి జైలుకు పంపించారు.

దోపిడీ కేసులో..

దోపిడీ కేసులో..

హైదరాబాద్ నగరంలోని తాలబ్‌కట్టకు చెందిన సయ్యద్ అహ్మద్ అలీ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2010లో దోపిడి కేసులో అరెస్టయి జైలో ఉన్నాడు. ఆ సమయంలో ఇద్దరు స్నేహితులయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత బీహార్‌కు చెందిన బాబ్లోతో కలిసి స్నాచింగ్‌ల బాట పట్టారు. స్నాచింగ్‌లు చేసిన వెంటనే మహారాష్ట్రకు వెళ్లిపోతారు. స్నాచింగ్‌లు చేసేందుకు నాలుగు నెలల క్రితం అపాచి బైక్‌ను కొనాగులో చేశాడు.

11 చైన్ స్నాచింగ్‌లు..

11 చైన్ స్నాచింగ్‌లు..

జంట కమిషనరేట్ల పరిధిలో 11 స్నాచింగ్ ఘటనలు చేశారు. ఈ ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ఈ ముఠాలోని మరో నిందితుడి గూర్చి గాలిస్తున్నారు. రెండు ముఠాల నుంచి కిలో బంగారు ఆభరణాలను, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇతను అర్ఫోజ్.

రూ. 50 వేల నజరానా

రూ. 50 వేల నజరానా

రెండు రోజుల క్రితం జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కొని పరారవుతున్న స్నాచర్లకు సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్ పోలీసులకు చిక్కాయి. ఈ నిందితులకు సంబంధించిన సమాచారం ఇస్తే రూ. 50 వేల బహుమానం ఇస్తామని సీపీ ప్రకటించారు.

English summary
Hyderabad police commissioner Mahender Reddy explained about the accused in chain snatching cases nabbed by the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X