వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్టులు: గన్‌పార్కు వద్ద నివాళులు, కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకరం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టులకు, వారి కుటుంబసభ్యుల కోసం నగదు రహిత వైద్యసేవలతో కూడిన హెల్త్‌కార్డులను ఇస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రభుత్వం జీవో జారీ చేయడంతో జర్నలిస్టులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

దేశం చరిత్రలో ఎక్కడా లేనివిధంగా హెల్త్ కార్డులు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. అక్రెడిటేషన్‌తో సంబంధం లేకుండా మీడియాలో పనిచేస్తున్న అందరికీ హెల్త్‌కార్డులు అందజేస్తామని ఆయన చెప్పారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హెల్త్‌కార్డుల జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ హైదరాబాదులోని గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపం వద్ద అమరులైన జర్నలిస్ట్‌లకు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ చిత్రపటానికి జర్నలిస్టులు క్షీరాభిషేకం చేశారు.

జర్నలిస్టుల హర్షాతిరేకాలు...

జర్నలిస్టుల హర్షాతిరేకాలు...

తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు నగదు రహిత వైద్య కార్డులను ఇస్తూ జీవో జారీ చేయడం పట్ల జర్నలిస్టులు సంబరాలు చేసుకున్నారు.

పదికోట్ల రూపాయల నిధి

పదికోట్ల రూపాయల నిధి

జర్నలిస్టుల సంక్షేమం కోసం పది కోట్ల రూపాయలతో నిధిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. పత్రికా యాజమాన్యాల నుంచి రెండు శాతం ఫండ్‌ను నిధికి సమకూర్చడం అభినందనీయమన్నారు.

ఇళ్ల స్థలాలకు విజ్ఞప్తి

ఇళ్ల స్థలాలకు విజ్ఞప్తి

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇవ్వడంలో చొరవచూపిన మంత్రులు కేటీఆర్, లకా్ష్మరెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

బాబు అహంకార ధోరణిపై అల్లం..

బాబు అహంకార ధోరణిపై అల్లం..


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అహంకార ధోరణితో తెలంగాణ ప్రజలపై వ్యాఖ్యలు చేయడాన్ని అల్లం నారాయణ ఖండించారు.

కార్యక్రమంలో వీరంతా..

కార్యక్రమంలో వీరంతా..

కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు పల్లె రవి, ప్రధాన కార్యదర్శి క్రాంతి, హైదరాబాద్ అధ్యక్షుడు యోగానంద్, తెమ్జూ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నగేశ్, కోశాధికారి మురళీసాగర్ పాల్గొన్నారు.

English summary
Telangana press Akademi chairman Allam Narayana lead the celebrations ogf journalis hailing Telangana CM K Chandrasekhar Rao government granting health cards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X