వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉలిక్కి పడిన ఏజెన్సీ: ఎన్‌కౌంటర్లో మరణించిన మావోయిస్టులు వీరే (పక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

వరంగల్: వరంగల్ జిల్లాలోని ఎన్‌కౌంటర్‌తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలోని గోవిందరావుపేట మండలం రంగాపురం శివారు మొద్దుగుట్ల అడవుల్లో మంగళవారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది. మృతులను ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలకు చెందిన మణికంఠి విద్యాసాగర్‌రెడ్డి (27) అలియాస్ దయా అలియాస్ సాగర్, వడ్డెపల్లికి చెందిన తంగళ్లపెల్లి శృతి (24) అలియాస్ మహితగా గుర్తించారు.

మూడు రోజుల క్రితం ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో మావోయిస్టులు జేసీబీని దహనం చేశారు. సంఘటనా స్థలంలో బ్యానర్లు కట్టారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకొని వాటిని తొలగించారు. జేసీబీ దహనాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు అధికారులు గ్రేహౌండ్స్ బలగాలను రంగంలోకి దింపి అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

ఉలిక్కిపడిన ఏజెన్సీ

ఉలిక్కిపడిన ఏజెన్సీ

గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ జరుపుతున్న నేపథ్యంలోనే మంగళవారం ఉదయం గ్రేహౌండ్స్ బలగాలు రంగాపురం గ్రామ శివారులోని మొద్దుగుట్ట అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు.

ఎదురు కాల్పులు

ఎదురు కాల్పులు

గ్రౌహౌండ్స్ బలగాలకు, నక్సలైట్లకు మధ్య మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారని, కొంత మంది తప్పించుకుని పారిపోయారని పోలీసులు చెప్తున్నారు

సంఘటనా స్తలంలో..

సంఘటనా స్తలంలో..

సంఘటనా స్థలం నుంచి ఒక 303, ఒక కార్బైన్, ఐదు కిట్‌బ్యాగులు, నాలుగు ల్యాండ్‌మైన్లు, పది డిటొనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వారిద్దరూ ఇలా..

వారిద్దరూ ఇలా..

విద్యాసాగర్ రెడ్డి, శ్రుతి కేకేడబ్ల్యూ (కరీంనగర్-ఖమ్మం-వరంగల్) డివిజన్ కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్నారు.

మావోయిస్టుల కాల్పులు

మావోయిస్టుల కాల్పులు

పారిపోవడానికి ప్రయత్నిస్తూమావోయిస్టులు పోలీసులవైపు కాల్పులు జరిపారని, మూడు ల్యాండ్‌మైన్స్ కూడా పేల్చారని పేర్కొంటున్నారు.

భయం గొప్పిట్లో...

భయం గొప్పిట్లో...

తప్పించుకున్న మావోయిస్టుల కోసం ప్రత్యేక పోలీసుల బలగాలు అడవులను గాలిస్తున్నాయి. ఈ సంఘటనతో ఏజెన్సీ గ్రామాలు భయం గుప్పిట్లో గడుపుతున్నాయి.

ఎమ్మెస్సీ చదివిన శృతి

ఎమ్మెస్సీ చదివిన శృతి

హన్మకొండ వడ్డెపల్లికి చెందిన తంగళ్లపెల్లి శృతి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఉద్యమ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన శృతి తొమ్మిది నెలల క్రితం మావోయిస్టు పార్టీలో చేరారు.

మూడు నెలల క్రితమే..

మూడు నెలల క్రితమే..

ఇంటర్మీడియట్‌తోనే చదువు ఆపేసిన విద్యాసాగర్‌రెడ్డి రాంపూర్‌లోని మనగ్రోమోర్ కంపెనీలో కొంతకాలం పనిచేశారు. మూడు నెలల క్రితం మావోయిస్టు పార్టీలో చేరారు.

English summary
Two maoists Vidyasagar Reddy and Shruthi died in an encounter in Warangal district in Telangana state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X