హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పిన పెనుప్రమాదం: హుస్సేన్ సాగర్ వద్ద కుంగిన రోడ్డు, కేటీఆర్ ఆదేశాలు బేఖాతరు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని ఎన్టీఆర్ మార్గ్‌లో రోడ్డు హఠాత్తుగా కుంగిపోయింది. ఆ సమయంలో ఎక్కువ మంది ప్రయాణం చేయకపోవడంతో ప్రమాదం తప్పింది. లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అంటున్నారు. ఆరు మీటర్ల రోడ్డు కుంగిపోయింది.

ఇది నాళాకు చెందిన మార్గం. ఇప్పుడు కుంగిన నాళా మార్గం రెండు కిలోమీటర్ల మేర ఉంది. దీంతో, కేవలం ఈ ప్రాంతంలోనే కుంగిందా, లేక రెండు కిలోమీటర్ల మేర ఇలాగే ప్రమాదకరంగా ఉందా అని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసాద్ ఐమాక్స్ వద్ద గల ఇందిరా గాంధీ విగ్రహం నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు ఈ నాళా ఉంది.

మూడు రోజులు ట్రాఫిక్ మళ్లింపు

కుంగిన ప్రాంతాన్ని జిహెచ్ఎంసి అధికారులు పూడ్చివేశారు. అలాగే, నాళా ఉన్న రెండు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని చూసేందుకు ట్రాఫిక్‌ను మూడు రోజుల పాటు మళ్లించనున్నారు. తెలంగాణ సచివాలయం, ఐమాక్స్ మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.

ప్రమాదస్థాయిలో హుస్సేన సాగర్: మరో గంట కురిస్తే.., కేసీఆర్ ఆదేశం ప్రమాదస్థాయిలో హుస్సేన సాగర్: మరో గంట కురిస్తే.., కేసీఆర్ ఆదేశం

వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్

ఇది కుంగిన సమయంలో ఓ వ్యక్తి అటుగా వాహనంపై వెళ్తున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ అతనిని కాపాడినట్లుగా తెలుస్తోంది. కాగా, హఠాత్తుగా రోడ్డు కుంగిపోయిన నేపథ్యంలో అధికారులు, పోలీసులు రోడ్డు మార్గాన్ని మళ్లించారు.

జలమయమైన మయూరి మార్గ్

మయూరి మార్గ్ పూర్తిగా జలమయమైంది. దేవనార్ అంధ పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మియాపూర్ - కొండాపూర్ రహదారిలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నగరంలో పలుచోట్ల రోడ్డు పైకి భారీగా వరద నీరు చేరింది.

మూసికి వరద ఉధృతి

హుస్సేన్ సాగర్‌తో పాటు మూసి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. మూసి ఏడు గేట్లు ఎత్తివేసి 22 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. 5వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లో, 2.5 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది.

కేటీఆర్ ఆదేశాలు బేఖాతరు

తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాలను జిహెచ్ఎంసి అధికారులు బేఖాతరు చేశారు. కంట్రోల్ రూంలో బల్దియా సిబ్బంది కనిపించలేదు. ఫిర్యాదుల ఫోన్ పని చేయలేదు. ముంపు ప్రాంత పరిస్థితులను అంచనా వేసేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

మూసినదీ కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. 36వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. దీంతో మధ్యాహ్నం ఎనిమిది గేట్లు ఎత్తి 32 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఎన్టీఆర్ మార్గ్

ఎన్టీఆర్ మార్గ్

భారీ వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలోని రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ మార్గ్‌లోని రోడ్డు కుంగిపోయింది. దాదాపు ఆరు మీటర్ల లోతు రోడ్డు కుంగింది. రోడ్డు కుంగిన విషయాన్ని అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు గమనించారు.

పరిశీలిస్తున్న అధికారులు

పరిశీలిస్తున్న అధికారులు

తక్షణమే అప్రమత్తమైన పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మళ్లించారు. పోలీసుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. వాహనదారులు రోడ్లపై చూసుకొని పోవాలని పోలీసులు హెచ్చరించారు. అనంతరం దానిని పూడ్చివేశారు.

బారీకేడ్లు

బారీకేడ్లు

భారీ వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలోని రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ మార్గ్‌లోని రోడ్డు కుంగిపోయింది. దాదాపు ఆరు మీటర్ల లోతు రోడ్డు కుంగింది. రోడ్డు కుంగిన విషయాన్ని అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు గమనించారు.

పూడ్చివేత

పూడ్చివేత

తక్షణమే అప్రమత్తమైన పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మళ్లించారు. పోలీసుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. వాహనదారులు రోడ్లపై చూసుకొని పోవాలని పోలీసులు హెచ్చరించారు. అనంతరం దానిని పూడ్చివేశారు.

పూడ్చివేత దృశ్యం

పూడ్చివేత దృశ్యం

కుంగిన ప్రాంతాన్ని జిహెచ్ఎంసి అధికారులు పూడ్చివేశారు. అలాగే, నాళా ఉన్న రెండు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని చూసేందుకు ట్రాఫిక్‌ను మూడు రోజుల పాటు మళ్లించనున్నారు. తెలంగాణ సచివాలయం, ఐమాక్స్ మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.

English summary
Pit road in Hyderabad due to heavy rain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X