వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొంగ ఓట్ల కోసం "ప్లాస్టిక్ ఫింగర్లు"..! సిరాచుక్క వేసేటప్పుడు వేళ్లు లాగండి..! వాట్సాప్‌లో వైరల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎన్నికల వేళ ఎన్నో జిమ్మిక్కులు. ప్రచారంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం ఒకెత్తయితే.. పోలింగ్ అయిపోయేదాకా మరో ఎత్తు. తెలుగు రాష్ట్రాల్లో ప్రచార పర్వానికి తెర పడటంతో ఇక పోలింగ్ పై దృష్టి సారించారు ఆయా పార్టీల నేతలు. ఈ నేపథ్యాన దొంగ ఓట్ల వేటలో ప్లాస్టిక్ వేళ్లు మార్కెట్లోకి వచ్చాయని.. సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో అందరి దృష్టి "ఆర్టిఫిషియల్‌ ఫింగర్స్" వైపు మళ్లింది.

<strong>వెరైటీ : దొంగ కిడ్నాప్.. వాడు దోచింది వీళ్లు కాజేశారు..!</strong>వెరైటీ : దొంగ కిడ్నాప్.. వాడు దోచింది వీళ్లు కాజేశారు..!

మిగిలింది ఒక్కరోజే.. డూప్లికేట్ దుమారం

మిగిలింది ఒక్కరోజే.. డూప్లికేట్ దుమారం

ఎన్నికలకు ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలింది. ప్రచార పర్వం ముగియడంతో పోలింగ్ పై ప్రధానంగా దృష్టి సారించిన నేతలు.. దొంగ ఓట్లు ఎలా వేయించాలనే దానిపై కసరత్తు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ వేళ్లు మార్కెట్లోకి వచ్చాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. సరిగ్గా ఎన్నికలకు ఒక రోజు ముందు ఇది బాగా వైరల్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చానీయాంశంగా మారింది.

 ప్లాస్టిక్ వేళ్ల రంగప్రవేశం

ప్లాస్టిక్ వేళ్ల రంగప్రవేశం

దొంగ ఓట్లను నిరోధించడానికి ఎన్నికల సంఘం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినా దొంగ ఓట్లు పడుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఉదయం పూట దొంగ ఓట్ల తంతు స్పీడ్ గా జరుగుతుంటుంది. చివరకు అసలు ఓటరు పోలింగ్ కేంద్రంలోకి ఎంట్రీ ఇచ్చేసరికి అప్పటికే అతడి ఓటు ఎవరో వేసిన సందర్భాలు అనేకం. అయితే ఓటు వేశారని తెలియజెప్పడానికి, మళ్లీ రెండోసారి ఓటేయ్యకుండా గుర్తుపట్టడానికి ఎన్నికల అధికారులు ఓటర్ల వేలికి సిరా చుక్క పెడుతుంటారు.

దొంగ ఓట్లు వేయించడంలో పండిపోయినోళ్లు కొందరుంటారు కదా. వాళ్ల మనుషులకు ఆ సిరాచుక్కను తొలగించి ఇతరుల ఓట్లు వేయించడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలో సిరాచుక్కను చెరిపివేయడానికి మెడికల్ షాపుల్లో దొరికే స్పిరిట్ వాడుతుంటారు. అయితే ఆ తిప్పలు తప్పేలా ఇప్పుడు మార్కెట్లోకి "ఆర్టిఫిషియల్‌ ఫింగర్స్" వచ్చేశాయంటూ వాట్సాప్ లో ఓ ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా ప్రమాదాల్లో వేళ్లు పోగొట్టుకున్న వారు ఈ సింథటిక్ ఫింగర్స్ ను అమర్చుకుంటారు.

 ఆర్టిఫిషియల్‌ ఫింగర్స్ వచ్చేశాయి.. జాగ్రత్త..!

ఆర్టిఫిషియల్‌ ఫింగర్స్ వచ్చేశాయి.. జాగ్రత్త..!

మార్కెట్లో లభించే ఈ ప్లాస్టిక్ వేళ్లు నిజమైన ఫింగర్స్ ను పోలి ఉంటాయి. తొడుగుల్లాగా ఉండే "ఆర్టిఫిషియల్‌ ఫింగర్స్" వేళ్లకు పెట్టుకుంటే గుర్తుపట్టడం కష్టమే. అంతలా అతుక్కుపోయినట్లు ఉంటాయి. ఏ మాత్రం కూడా డౌట్ రాకుండా మన వేళ్లతో కలిసిపోతాయి. వీటిని ధరించి పోలింగ్ కేంద్రాలకు వెళ్తే ఎన్నికల అధికారులు పెట్టే సిరా గుర్తు ప్లాస్టిక్ వేలిపై పడుతుంది. బయటకొచ్చాక దాన్ని తీసివేస్తే చాలు.. ఓటు వేసిన దాఖలాలే కనిపించవు. అలా మరో వేలి తొడుగుతో ఇంకోసారి పోలింగ్ కేంద్రానికి వెళ్లే అవకాశముంటుంది. ఇతరుల ఓట్లను అడ్డదారుల్లో వేసే అవకాశముంటుంది.

అధికారులు అప్రమత్తమా?

అధికారులు అప్రమత్తమా?

ఈ ఆర్టిఫిషియల్ ఫింగర్స్ తో ఎన్నికల్లో భారీగా నకిలీ ఓట్లు వేసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వాట్సాప్ లో దీనికి సంబంధించి తెగ వైరల్ అయింది. "పోలింగ్ అధికారులు జాగ్రత్త.. ! ఓటర్ల వేళ్లు బాగా లాగి చూసిన తర్వాతే సిరా గుర్తు వేయండి".. దొంగ ఓట్లు వెయ్యడానికి Fake Fingers వచ్చేశాయంటూ నెటిజన్లు వీపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇది కాస్తా ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు ప్లాస్టిక్ ఫింగర్లపై జాగ్రత్త వహించాలని ఆదేశించినట్లు సమాచారం.

English summary
Artificial Fingers came into market in election time going hot topic. With these Plastic Fingers votes may be manipulated. This matter viral in whatsapp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X