హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దసరా, దీపావళికి సికింద్రాబాద్ రైల్వే షాక్, ఆ టిక్కెట్ ధరల పెంపు

పండుగ సీజన్లో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకులకు షాకిచ్చింది. ప్లాట్ ఫాం టిక్కెట్ ధరలను భారీగా పెంచుతోంది. తాత్కాలికంగా ఈ టిక్కెట్ ధరను రెండింతలు చేస్తుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పండుగ సీజన్లో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకులకు షాకిచ్చింది. ప్లాట్ ఫాం టిక్కెట్ ధరలను భారీగా పెంచుతోంది. తాత్కాలికంగా ఈ టిక్కెట్ ధరను రెండింతలు చేస్తుంది.

చీరల షాక్: కేసీఆర్ ఆరా, తండ్రికి సర్దిచెప్పిన కేటీఆర్, జుట్టు లాక్కొని కొట్టుకున్న మహిళలు (ఫోటోలు)చీరల షాక్: కేసీఆర్ ఆరా, తండ్రికి సర్దిచెప్పిన కేటీఆర్, జుట్టు లాక్కొని కొట్టుకున్న మహిళలు (ఫోటోలు)

టిక్కెట్ ధర రెండింతలు

టిక్కెట్ ధర రెండింతలు

ఇప్పుడు దసరా, దీపావళి పండుగ సీజన్. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఈ ప్లాట్ ఫాం టిక్కెట్లు పెంచింది. ప్రస్తుతం ప్లాట్ ఫాం టిక్కెట్ ధర రూ.10గా ఉంది. దీనిని ఇప్పుడు రూ.20కి చేస్తోంది.

అప్పటి దాకా అమలులో

అప్పటి దాకా అమలులో

ప్లాట్ ఫాం టిక్కెట్ ధర పెంపు ధరలు అక్టోబర్ 13వ తేదీ వరకు అమలులో ఉంటాయి. దసరా, దీపావళి పండుగ సీజన్ అయిపోయే వరకు ఈ ధర ఉంటుంది. ఆ తర్వాత యథావిథిగా ఉంటుంది.

అందుకే ఈ పెంపు

అందుకే ఈ పెంపు

ప్రస్తుతం పండుగ సీజన్ నేపథ్యంలో ప్లాట్ ఫాం పైకి అనవసరంగా ఎక్కువ మంది ఎవరూ లేకుండా చేసే ఉద్దేశ్యంలో భాగంగానే ఈ ధరలు అమలు చేయనున్నారు. ఇలా చేయడం ద్వారా ఎక్కువ మంది అనవసరంగా ప్లాట్ పాం పైకి రాకుండా ఉంటారు.

పండుగల సమయంలో రైల్వే స్టేషన్ కిటకిట

పండుగల సమయంలో రైల్వే స్టేషన్ కిటకిట

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రోజుకు లక్షలాది మంది ప్రయాణీకులు ప్రయాణిస్తుంటారు. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగల సందర్భంలో ఈ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది.

English summary
Cashing in on the festival season, the South Central Railway has increased the price of platform tickets from Rs.10 to Rs.20 to control the large number of visitors who come to stations to send off or receive passengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X