వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లీజ్ డాక్ట‌ర్.. మా మ‌త్తు ఒదిలించండి..! డీ-అడిక్ష‌న్ సెంట‌ర్ల‌కి ప‌రుగులు తీస్తున్న యువ‌త‌..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : నిద్ర మ‌త్తు వేరు.. మాద‌క ద్ర‌వ్యాల మ‌త్తు వేరు. ఏదైనా మోతాదులో చేస్తే గ‌మ్మ‌త్తుగా ఉంటుంది కానీ శ్రుతి మించితే మెద‌డు తిమ్మిరిప‌ట్టి ప‌నిచేయ‌కుండా మారిపోవ‌డం మాత్రం ఖాయం. స‌ర‌దాగా మొద‌లౌతున్న అల‌వాట్లు స‌గం జీవితం నాశ‌నం ఐన త‌ర్వాత గాని ఏం కోల్పోతున్న‌మో అర్థం కావ‌డం లేదు నేటి యువ‌త‌కు.హాబీగా మొదలవుతున్న తాగుడు, సిగరెట్లు, డ్రగ్స్.. యువతను వదలకుండా పట్టేసుకుంటున్నాయి. వ్యసనంగా మారి తీరని పర్యవసానాలకు దారితీస్తున్నాయి. మాద‌క ద్ర‌వ్యాల వ‌ల్ల జ‌రుగుతున్న న‌ష్టాన్ని ఆల‌స్యంగా ప‌సిగ‌డుతున్న యువత డీ-అడిక్షన్ సెంటర్ కు ప‌రుగులు తీస్తున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కు రోజూ 50 నుం చి 70 మంది వస్తున్నారని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. వారికోసం డీఅడిక్షన్ వార్డులో 30 బెడ్లను ఏర్పాటు చేయ‌డం విశేషం.!

 పదిహేనేళ్లకే తాగుడు మొద‌లు..! సాయంత్రం కాగానే ఛీర్స్ అంటున్న టీనేజ‌ర్లు..!!

పదిహేనేళ్లకే తాగుడు మొద‌లు..! సాయంత్రం కాగానే ఛీర్స్ అంటున్న టీనేజ‌ర్లు..!!

డీ అడిక్షన్ సెంటర్ కు వస్తున్న వారిలో మద్యానికి బానిసైనోళ్లు 60 శాతం, గంజాయి, సిగరెట్​, గుట్కా వ్యసనపరులు 30%, మత్తు ఇంజెక్షన్లు, నిద్రమాత్రలు, నొప్పి టాబ్లెట్లకు అలవాటైన వారు 10 శాతం మంది ఉన్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా డీఅడిక్షన్ కోసం పేషెంట్లు వస్తుండడం గమనార్హం. గంజాయి బాధితుల్లో ఎక్కువగా కర్నాటక సరిహద్దుల్లోని గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా ఉంటున్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన డీఅడిక్షన్ సెంటర్లు 50 వరకూ ఉండగా, గుర్తింపు లేనివి వందల్లో ఉన్నాయి . అన్ని హాస్పిటళ్లు కలిపి రోజూ సగటున వెయ్యి మంది వరకు వస్తున్నట్టు స‌మాచారం.

 ద‌మ్మ‌రో ద‌మ్..! మాద‌క ద్ర‌వ్యాల‌కు బానిస‌ల‌వుతున్న న‌గ‌ర ప్ర‌జ‌లు..!!

ద‌మ్మ‌రో ద‌మ్..! మాద‌క ద్ర‌వ్యాల‌కు బానిస‌ల‌వుతున్న న‌గ‌ర ప్ర‌జ‌లు..!!

​దేశంలో 70% మంది యువత పదిహేనేళ్లకే మందు తాగడం మొదలుపెట్టేస్తున్నారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్​ అనే సంస్థ సర్వేలో తేలింది. ప్రస్తుతం మత్తు వదిలించుకోవడానికి వస్తున్న వారిలోనూ 15-40 ఏళ్ల వయసున్నవారే 60 శాతం ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో 25 ఏళ్లలో పు వాళ్లు 20 శాతం మంది ఉన్నారు. చదువుల ఒత్తిళ్లతో మద్యం, సిగరెట్​ తాగడాన్ని ఫ్యాషన్ గా యువత భావిస్తోందట. అందుకే పాఠశాల వయసులోనే మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని మానసిక నిపుణులు వివరిస్తున్నారు.

 ఇప్పుడిప్పుడే ఆరోగ్యంపై చైత‌న్యం..! వ్య‌స‌నాల‌కు దూరంగా ఉండాల‌నుకుంటున్న యువ‌త‌..!!

ఇప్పుడిప్పుడే ఆరోగ్యంపై చైత‌న్యం..! వ్య‌స‌నాల‌కు దూరంగా ఉండాల‌నుకుంటున్న యువ‌త‌..!!

ఇప్పుడు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరగడం, ఆరోగ్యం క్షీణిస్తుండడంతో పాటు అవ‌గాహ‌న పెర‌గ‌డం వ‌ల్లే, వాటిని మానేసేందుకు యువత ముందుకొస్తున్నట్టు మానసిక వైద్య నిపుణులు చెప్పుకొస్తున్నారు. ట్రీట్​మెంట్​ కోసం వస్తున్న వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోందన్నారు. అది ఎలా అలవాటైందో తెలుసుకుని, మందులు, కౌన్సిలింగ్‌‌‌‌, సైకోథెరపీ వంటి చికిత్సను ఇస్తున్నట్టు చెప్పారు. 45 నుంచి 60 రోజుల పాటు డీ అడిక్షన్ చికిత్సను ఇస్తున్నామని డాక్ట‌ర్లు చెప్పుకొస్తున్నారు.

మెదడుపై ప్రభావం..! తీవ్ర ప్ర‌భావం చూప‌క‌ముందే చికిత్స చేస్తే మంచిదంటున్న డాక్ట‌ర్లు..!!

మెదడుపై ప్రభావం..! తీవ్ర ప్ర‌భావం చూప‌క‌ముందే చికిత్స చేస్తే మంచిదంటున్న డాక్ట‌ర్లు..!!

మద్యం, మత్తు పదార్థాలను అతిగా తీసుకుంటే మెదడుపై ప్రభావం పడుతుంది. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. మతిమరుపు కూడా వచ్చే ప్రమాదముంది. డీ అడిక్షన్ కోసం వస్తున్న వారిలో మానసికంగా బాగా దెబ్బతిన్నవారిని ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ చేసుకుని ట్రీట్ మెంట్ ఇస్తున్న‌ట్టు మాన‌సిక వైద్యులు చెప్పుకొస్తున్నారు. లేదంటే మందులు, కౌన్సిలింగ్​ ఇచ్చి పంపిస్తున్నామంటున్నారు డాక్ట‌ర్లు.

English summary
Due to the loss of drug trafficking, the youth who are late to the de-addiction center is running away. The hospital staff said that 70 to 50 people are coming to Hyderabad at Errgadda Mental Hospital daily. They have set up 30 beds in the deedition ward for them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X