హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్లీజ్ నన్ను హైదరాబాద్ లో కలవొద్దు..! ఇబ్బందికర పరిస్థితి ఉంటుందన్న హరీష్ రావు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Don't Come To Hyderabad To Meet Me : Harish Rao || కార్యకర్తలు హైదరాబాద్ లో కలవొద్దున్న హరీష్ రావు

హైదరాబాద్ : మంత్రి హరీష్ రావు కఠిన నిర్ణయం తీసుకున్నారు. అభిమానులు, పార్టీ శ్రేణుల పట్ల కనికరం లేకుండా మాట్లాడుతున్నారు. అంతే కాకుండా హైదరాబాద్ లో ఉన్న తనను కలవడానికివస్తే సహించేది లేదని హెచ్చరికలు కూడా జారీ చేసారు. హరీష్ రావు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల గులాబీ శ్రేణులు అవాక్కవుతున్నారు. సహచర మంత్రులు కూడా ఔరా అనుకునే పరిస్థితులు తలెత్తాయి. హరీష్ రావు నిజంగా కార్యకర్తల పట్ల అంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. కార్యకర్తలు, అభిమానుల పట్ల ప్రేమతో ఆ నిర్ణయం తీసుకున్నారు మంత్రి హరీష్ రావు. అదేంటో తెలుసుకుందాం..!!

 హరీష్ వైపు ఆర్టీసీ కార్మికులు చూపు: రంగంలోకి దిగని ట్రబుల్ షూటర్: అడ్డుకుంటుందెవరు..! హరీష్ వైపు ఆర్టీసీ కార్మికులు చూపు: రంగంలోకి దిగని ట్రబుల్ షూటర్: అడ్డుకుంటుందెవరు..!

 మంత్రి హరీష్ కఠిన నిర్ణయం..! అవాక్కవుతున్న అభిమానులు..!!

మంత్రి హరీష్ కఠిన నిర్ణయం..! అవాక్కవుతున్న అభిమానులు..!!

మంత్రి హరీశ్ రావు ఎక్కడ ఉన్నా తన ప్రత్యేకతను చాటుకుంటారు. అందుకు తగ్గట్టే కార్యకర్తలను ఉద్దేశించి ఆసక్తికర ప్రకటన చేశారు. ఈ మద్య మీడియాలో అంతగా కనిపించకుండా ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మేనల్లుడు, మంత్రి హరీష్ రావు తాజాగా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. పదవి ఉన్నా లేకున్నా, నిత్యం ప్రజల మధ్య ఉండేందుకు, వారితో మమేకం అయ్యేందుకు హరీశ్ పడే తపన అంతా ఇంతా కాదు. సెలవు రోజున కూడా నియోజకవర్గంలోనే ప్రజలతో ఉంటారనే అభిప్రాయం ఉంది. ఆయన నియోజకవర్గంలో ఉంటే, జాతర మాదిరి ప్రజలు పోటెత్తుతుంటారు.

 ప్రజలకు అందుబాటులో ఉంటా..! కానీ నాకోసం ప్రత్యేకంగా నగరానికి రావొద్దంటున్న హరీష్..!!

ప్రజలకు అందుబాటులో ఉంటా..! కానీ నాకోసం ప్రత్యేకంగా నగరానికి రావొద్దంటున్న హరీష్..!!

ఇంత చేసిన తర్వాత కూడా, ఆ పని చేయాలి, ఈ పని చేయాలంటూ ఆయనకు లెక్కలేనన్ని వినతులు వస్తుంటాయి. ఊళ్లోనే కాదు, హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా ఈ తాకిడి హరీష్ రావు కు ఎక్కువే. అన్నింటికి మించి ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మీద అంచనాలు పెరిగిపోవటంతో, తాకిడి అంతకంతకూ పెరుగిపోయింది. ఇదే సందర్బంలో హరీష్ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వివిధ పనులకోసం తన ఇంటికి వచ్చే కార్యకర్తల హడావుడిని తగ్గించాలని హరీశ్ రావు నిర్ణయం తీసుకున్నారు. తాను వారంలో నాలుగు రోజులు సిద్ధిపేటలోనే ఉంటానని, సమస్యలు ఏమున్నా సిద్దిపేటలోనే చర్చించాలని హైదరాబాద్ కు రావొద్దని కార్యకర్తలకు, అభిమానులకు స్పష్టం చేసారు హరీష్ రావు.

 ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించుకోవాలి..!ప్రజలను సిద్దిపేట దాటి రావొద్దంటున్న ఆర్దిక మంత్రి..!!

ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించుకోవాలి..!ప్రజలను సిద్దిపేట దాటి రావొద్దంటున్న ఆర్దిక మంత్రి..!!

పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ రావటం, తీరా వారొచ్చిన తర్వాత పనులు కాకపోతే, మనసు కష్టపెట్టుకొని వెళ్లాల్సి వస్తుందని, అందుకే తనను సిద్ధిపేటలోనే కలవాలని ఆయన కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారు. ఏదైనా ఆసుపత్రి సమస్య వస్తే హైదరాబాద్ కు రావాలే కానీ, మిగిలిన ఏ విషయం కోసమైనా.. తనను సిద్ధిపేటలోనే కలవాలని హరీశ్ కోరుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఖాతా ఆయనో పోస్టు పెట్టారు. దాదాపు ఐదు వేల రూపాయిలు ఖర్చు పెట్టి బండి మాట్లాడుకొని, టిఫిన్ ఖర్చులు పెట్టుకొని వస్తున్నారని, ఇలా వచ్చే పనుల్లో రూపాయికి 90 పైసలు వరకూ కాని పనులే ఎక్కువగా ఉంటాయని హరీష్ రావు చెప్పుకొచ్చారు.

 హరీష్ నిర్ణయం పట్ల హర్షం..! మంచి నిర్ణయం అంటున్న సహచర మంత్రులు..!!

హరీష్ నిర్ణయం పట్ల హర్షం..! మంచి నిర్ణయం అంటున్న సహచర మంత్రులు..!!

ఇంతదూరం వచ్చి పని కాకపోతే మనసుకు కష్టమవుతుందని, అభిమానుల మనసు కష్టపడితే తన మనసు బాధ పడుతుందని హరీష్ అన్నారు. కార్యకర్తలు నొచ్చుకుంటే, తన మనసు నొచ్చుకున్నట్లే అని చెప్పుకొచ్చారు. అందుకే, సిద్దిపేటలోనే కలవాలని, హైదరాబాద్ అస్సలే రావొద్దని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడున్నరోజుల్లో మంది మార్బలంతో, హంగూ హాడావిడి ఉండాలని కోరుకునే నేతలకు భిన్నంగా హరీష్ ఆలోచనా విధానాన్ని పలువురు నేతలు ప్రశంసిస్తున్నారు. రాజకీయాల్లో ఇదో ఆహ్వానించదగ్గ పరిణామంగా చర్చ జరుగుతోంది.

English summary
Minister Harish said that no Fans should come Hyderabad to meet him.He said Its most expenditure to come to Hyderabad. The minister made it clear that the Cadre were to join Siddipet and Hyderabad would not come for solution to the problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X