హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మా అమ్మను కాపాడండి: కేటీఆర్‌కు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని వినతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ తల్లిని కాపాడాలంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తెలంగాణ ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌ను కోరింది. బీహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారన్ జిల్లా రక్షాహుల్ జిల్లాలో అపహరణకు గురైన తన తల్లిని కాపాడాలని హైదరాబాద్ హైటెక్ సిటీకి చెందిన టెక్కీ గరిమ ట్విట్టర్ వేదికగా మంత్రికి విన్నవించింది.

మంగళవారం తన తల్లిని ఇంట్లో నుంచి కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని, ఆమె ఆచూకీ తెలియడం లేదని గరిమ ట్విట్టర్ వేదకిగా వెల్లడించింది. తన తల్లిని కాపాడాలంటూ మంత్రి కేటీఆర్ తోపాటు బీహార్ సీఎం నితీస్ కుమార్, బీహార్ డీజీపీ, సంబంధిత జిల్లా కలెక్టర్‌, కేంద్రమంత్రి అమిత్ షాను కోరింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే మంత్రి కేటీఆర్.. ఆమె వినతికి వెంటనే స్పందించారు. యువతి తల్లిని కాపాడుతామంటూ హామీ ఇచ్చారు. తెలంగాణ డీజీపీకి ఈ యువతి అభ్యర్థనను తెలియజేశారు. అంతేగాక, బీహార్ డీజీపీని సంప్రదించి, గరిమ తల్లిని ఆచూకీ కనుగొనాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి సూచించారు.

please save my mother: A lady techie requests minister KTR

మంత్రి ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ.. బీహార్ డీజీపీకి సమాచారాన్ని అందించారు. 'మీ తల్లి సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తుందని నమ్ముతున్నాను' అని గరిమ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.

గుత్తాకు శుభాకాంక్షలు


శాసనసభ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ప్రజాజీవనంలో సుదీర్ఘ కాలంపాటు కొనసాగాల్సిందిగా మంత్రి ఆకాంక్షించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి 67వ పుట్టిన రోజు సందర్భంగా కేటీఈర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

English summary
please save my mother: A lady techie requests Telangana Minister KTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X