వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించనున్న మోడీ: రేట్లు ఇలా, ఏటా ధరలు పెంచవచ్చు!

భాగ్యనగరం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన మెట్రో రైలులో ప్రయాణించనున్నా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన మెట్రో రైలులో ప్రయాణించనున్నారు. దాదాపు ఇరవై నుంచి ఇరవై అయిదు నిమిషాల పాటు ఆయన ఇందుకోసం సమయం కేటాయిస్తారు.

Recommended Video

Hyderabad Metro Rail To Be Launched On Nov 28 : హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభ తేదీ

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో కీలక అడుగు, సీఎంఆర్ఎస్ అనుమతిహైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో కీలక అడుగు, సీఎంఆర్ఎస్ అనుమతి

 మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మియాపూర్ హెలికాప్టర్‌లో చేరుకుంటారు. హెలిప్యాడ్ నుంచి మెట్రో స్టేషన్ చేరుకొని, మియాపూర్‌లో రైలును ప్రారంభిస్తారు. అనంతరం ఆయన రైలులో ప్రయాణిస్తారు.

 రైలులో ప్రయాణించనున్న మోడీ

రైలులో ప్రయాణించనున్న మోడీ

మెట్రో రైలులో మియాపూర్ నుంచి ఎస్సార్ నగర్ లేదా మెట్రో రైలు ఇంటర్ లింకింగ్ స్టేషన్ అమీర్ పేట వరకు ప్రయాణిస్తారు. అక్కడి నుంచి తిరిగి మెట్రోలో మియాపూర్ వెళ్తారు. అటు నుంచి హెలిప్యాడ్‌కు చేరుకొని, అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమం నాలుగు గంటలకు ఉంది.

 మెట్రో రైలు ధరలు

మెట్రో రైలు ధరలు

మెట్రో రైలు ధరలు రెండు రోజుల్లో ఖరారు కానున్నాయి. రూ.12 నుంచి 20 రూపాయల వరకు మెట్రో ధరలు ఉండే అవకాశముంది. అత్యధికంగా ఇరవై రూపాయలు, అత్యల్పంగా పన్నెండు రూపాయలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఫుల్ డే పాస్ రూ.60గా ఉండనుంది. అయితే రెండు రోజుల తర్వాత ఖరారు కానున్నాయి.

 ప్రతి ఏటా ధరలు పెంచుకునే అవకాశం

ప్రతి ఏటా ధరలు పెంచుకునే అవకాశం

ఎల్ అండ్ టీ ప్రతి ఏటా 5 శాతం వరకు మెట్రో రైలు ధరలు పెంచుకునే వెసులుబాటు ఉందని తెలుస్తోంది. గతంలో మెట్రో ధరలు మినిమం రూ.8, అత్యధికం రూ.19గా నిర్ణయించారు. ఫుల్ డే పాస్ రూ.40గా నిర్ణయించారు. కానీ ప్రాజెక్టు వ్యయం పెరగడంతో ధరలు కూడా పెంచాలని చూస్తున్నారు.

English summary
The Hyderabad metro rail has got all safety approvals and is ready for inauguration by Prime Minister Narendra Modi on November 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X