• search
 • Live TV
మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ముసి ముసి నవ్వులు నవ్విండు ఔతల పడ్డాడు .. మోదీపై కేటీఆర్ సెటైర్లు

|
  We Compete Ourselves KTR Says In Medak Meeting | Oneindia Telugu

  హైదరాబాద్ : టీఆర్ఎస్ సన్నహాక వేదికగా ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు కేటీఆర్. రాష్ట్రంపై వివక్ష చూపారని ఆరోపణలు గుప్పించారు. పొరుగున ఉన్న ఏపీపై చూపిన ప్రేమ చూపలేదని విమర్శించారు. వివిధ సంక్షేమ కార్యక్రమాలకు పిలిచి తమ సమస్యలను చెప్పినా మొర ఆలకించలేదని మండిపడ్డారు.

  మాకు మేమే పోటీ .. మెజార్టీలో పోటాపోటీ ... మెదక్ సభలో కేటీఆర్ సవాల్

  ముసి ముసి నవ్వులే ..

  ముసి ముసి నవ్వులే ..

  ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీని ఆహ్వానించామని గుర్తుచేశారు. పిలిస్తే వచ్చారు కానీ .. తమకు నిధులు కేటాయించలేదని విమర్శలు గుప్పించారు. మిషన్ భగీరథ పథకానికి నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ అడిగితే ముసి ముసి నవ్వులు నవ్వి ఔతల పడ్డాడని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫారసు చేసింది. కానీ పక్షపాత నరేంద్రమోదీ సర్కార్ పెడచెవిన పెట్టిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్

  24 పైసలు ఇవ్వలే ..

  24 పైసలు ఇవ్వలే ..

  మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కోసం రూ.24 కోట్ల కేటాయించాలని .. నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే దిక్కేలేదన్నారు కేటీఆర్. 24 వేల కోట్లు అడిగితే 24 పైసలు కూడా ఇవ్వలేదని వ్యంగ్యాస్త్రం సంధించారు. అదే ఢిల్లీలో మన ప్రభుత్వం ఉంటే నిధుల కోసం చేయి చాచే అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉంటే సంక్షేమ పథకాలకు నిధులు డోకా ఏర్పడదన్నారు.

  పోలవరం ఓకే .. కాళేశ్వరం, పాలమూరు ఏదీ ..?

  పోలవరం ఓకే .. కాళేశ్వరం, పాలమూరు ఏదీ ..?

  రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. మరి కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అదే రాష్ట్రంలో 17 సీట్లు గెలిస్తే .. కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా మారి .. నిధులు, ప్రాజెక్టులకు హోదా తీసుకొవచ్చని .. దీంతో రాష్ట్రం మరింత అభివృద్ధి దిశలో పయనిస్తోందని పేర్కొన్నారు.

  మమత, లాలూ రైళ్లు .. బాలు రోడ్లు

  మమత, లాలూ రైళ్లు .. బాలు రోడ్లు

  ఇదివరకు కేంద్రం ప్రభుత్వంలో భాగస్వాములైన నేతలు తమ తమ ప్రాంత ప్రయోజనాల కోసం పాటుపడ్డారని గుర్తుచేశారు కేటీఆర్. రైల్వేమంత్రిగా మమతా బెనర్జీ ఉంటే బెంగాల్ కు, లాలూప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో తన ఇంటి నుంచి అత్తారింటికి రైలు వేసుకున్నారని గుర్తుచేశారు. ఇక తమిళనాడుకు చెందిన టీఆర్ బాలు .. ఉపరితల రవాణాశాఖ మంత్రిగా .. జాతీయ రహదారులను తమిళనాడు జాతికి అంకితం చేశారిని గుర్తుచేశారు. మిగతా ప్రాంతాలకు అన్యాయం చేశారని ఉదహరించారు. ప్రధాని మోదీ కూడా గుజరాత్ మేలు కోసం పాటుపడ్డారని .. బుల్లెట్ ట్రైన్ ను ఢిల్లీ నుంచి ముంబైకి వేయడంలో ఆయన అంతరంగం బయటపడిందని విమర్శించారు.

  17 సీట్లు గెలిస్తే ఎర్రకోటపై జెండా ఎగరేద్దాం

  17 సీట్లు గెలిస్తే ఎర్రకోటపై జెండా ఎగరేద్దాం

  రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లు గెలిస్తే .. మనకు రావాల్సిన నిధులను రాబట్టుకొవచ్చని అభిప్రాయపడ్డారు కేటీఆర్. గోల్కొండ కోటాపై తెలంగాణ జెండా ఎగిరేసినట్టు .. హస్తినలోని ఎర్రకోటాపై జెండా ఎగురవేయొచ్చని సూచించారు. అంతా కలిసి కష్టపడి మెజార్టీ సీట్లు సాధిస్తే .. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన రాష్ట్రానికి నిధుల కోరత తీరుతుందని పేర్కొన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Prime Minister Modi has been criticized by the TRS working president ktr. He has criticized the love shown against neighboring AP. They called for various welfare programs and told them that they did not listen to our problems. Recall that Prime Minister Modi was invited to launch the prestigious mission Bhagiratha. But come to the conclusion that they are not funded ktr told.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more