• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏందయ్యా చంద్రం..! ఏంచేయలేదా కేంద్రం..! ఎందుకైనా మంచిది మోదీతో జర బద్రం..!!

|

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తి పోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు పలువురు అతిథులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అందులో రెండు పక్క రాష్ట్రాల సీఎంలు ఉన్నారు. అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఇటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను ఆహ్వానించిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీని మాత్రం ఇప్పటివరకూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించక పోవడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ కు గాని, కాళేశ్వరం ప్రాజెక్టుకు గానీ ప్రధాని హోదాలో మోదీ చేసిందేమీ లేదని చంద్రశేఖర్ రావు ఆరోపిస్తున్నారు.

వామ్మో.. ఏందీ ఈ మోతలు..! నగరంలో ఎక్కువుతున్న శబ్ధ కాలుష్యం..

ఏపీ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆహ్వానం..! ప్రధానిని ఎందుకు పిలవ లేదు..!!

ఏపీ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆహ్వానం..! ప్రధానిని ఎందుకు పిలవ లేదు..!!

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం గోదావరి నదిపై జరిగిన విషయం తెలిసిందే. గోదావరి జలాల్లో దిగువన ఉన్న ఏపీకి మరియు ఎగువన ఉన్న మహారాష్ట్ర రెండు రాష్ట్రాలకు వాటాలు ఉన్నాయి. ఆ కారణంగా చంద్రశేఖర్ రావు ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించి,ఎలాంటి జల వివాదాలు రాకుండా ముందే తెలివిగా వ్యవహరించారు అనుకోవచ్చు. రెండు సార్లు మోడీ సమావేశాలకు వెళ్లకపోవడం. ఎన్నికలు ముగిసి మోడీ రెండవసారి ప్రధాని అయ్యాక, రెండు సార్లు మోడీ అధ్యక్షతన జరిగే సమావేశాలకు చంద్రశేఖర్ రావు గైర్హాజరయ్యారు. నీతి ఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మోడీని ఆహ్వానిస్తానని ఆ మధ్య చంద్రశేఖర్ రావు అన్నారు. కానీ ఆ సమావేశానికి చంద్రశేఖర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి హాజరుకాలేదు. నేడు జరగనున్న అఖిలపక్ష సమావేశానికి తాను వెళ్లకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తన కుమారుడు కేటీఆర్ ను పంపించారు.

కాళేశ్వరానికి కేసీఆర్ మోడీని ఎందుకు ఆహ్వానించలేదు? కారణం అదేనా..!!

కాళేశ్వరానికి కేసీఆర్ మోడీని ఎందుకు ఆహ్వానించలేదు? కారణం అదేనా..!!

కాళేశ్వరం ప్రాజెక్టుతో జాతీయ హోదా లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, అందువల్ల మోడీని ఈ కార్యక్రమానికి ఆహ్వా నించలేదని అనుకోవచ్చు కానీ, మెట్రో రైలు ప్రారంభోత్సవానికి, మిషన్ భగీరథకు మోడీని చంద్రశేఖర్ రావు ఆహ్వానించిన విషయం అందరికి తెలిసిందే. మరి అలాంటపుడు ప్రతిష్టాత్మకమైన మరియు తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మోడీని ఆహ్వానించకపోవడం మతలబు ఏంటి అనే చర్చ సాగుతోంది.అయితే లోక్ సభ ఎన్నికల ముందు థర్డ్ ఫ్రంట్ పేరిట చంద్రశేఖర్ రావు చేసిన హడావిడి, బీజీపీపై చేసిన విమర్శలు కూడా అంత ఇంతా కాదు.ఈ కారణంతో కూడా చంద్రశేఖర్ రావు మోడీని కలవడానికి విముఖత చూపుతున్నారని అంటున్నారు.

తెలంగాణలో బీజేపి ప్రత్యామ్నాయం అవుతోందా..! అందుకే కేసీఆర్ అప్రమత్తమయ్యారా..!!

తెలంగాణలో బీజేపి ప్రత్యామ్నాయం అవుతోందా..! అందుకే కేసీఆర్ అప్రమత్తమయ్యారా..!!

ఇంకా తెలంగాణలో ప్రతిపక్షమంటూ లేకుండా చేయాలని చంద్రశేఖర్ రావు మొదటి నుంచి రాజకీయ వ్యూహరచన చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే మొదట తెలుగుదేశం పార్టీని ఆయన లక్ష్యం చేసుకుని నామరూపాలు లేకుండా చేశారని, రెండో విడత కాంగ్రెసును లక్ష్యం చేసుకుని ప్రతిపక్ష హోదాకు ఎసరు పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే తెలంగాణలో పెద్దగా ప్రభావం లేని బీజీపీ లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇవ్వడంతో, చంద్రశేఖర్ రావు కు బీజీపీ రాష్ట్రంలో బలపడుతున్నట్లు సమాచారం వెళ్ళింది. దీనితో చంద్రశేఖర్ రావు వ్యూహానికి బీజీపీ గండి కొట్టే ప్రమాదం ఉందని ఆయన ఆలోచనలో పడ్డట్లు ఉన్నారు.

  కాళేశ్వరం పూర్తయితే రైతుల జీవితాల్లో మార్పు - సీఎం కేసీఆర్
  బీజేపిని నిలువరించాలి..! అందుకే దూరం పెడుతున్న కేసీఆర్..!!

  బీజేపిని నిలువరించాలి..! అందుకే దూరం పెడుతున్న కేసీఆర్..!!

  ఇదే సమయంగా భావించి తెలంగాణలో పాగా వేయడానికి బీజీపీ పకడ్బందీ వ్యూహరచన చేసినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాదు నుంచి విజయం సాధించిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారనే మాట వినిపిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి పిరాయింపులను ప్రోత్సంహించి బీజీపీ తెలంగాణలో ఉనికి పెంచుకోవాలని భావిస్తోంది. ఈ స్థితిలో కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మోడీని ఆహ్వానిస్తే బీజీపీ కార్యాచరణకు బలం చేకూర్చినట్లవుతుందని చంద్రశేఖర్ రావు భావించి ఉండవచ్చునని అంటున్నారు.మొత్తం మీద, మోడీని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించే ఉద్దేశం చంద్రశేఖర్ రావు కు లేదని స్పష్టమవుతుంది.

  English summary
  Telangana CM Chandrasekhar Rao invited many guests to the inauguration of the Kaleshwaram Elevation Project. There are two adjacent state CMs. There has been political debate over the invitation of AP chief minister YS Jagan Mohan Reddy and Maharashtra chief minister Fadnavis and not to invite Prime Minister Narendra Modi to the event.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more