వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న హైదరాబాద్, ఇక్కడ అవకాశం రాలేదు: తెలుగులో మోడీ, కార్యకర్తల నినాదాలు

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మధ్యాహ్నం గం.1.25 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్,

|
Google Oneindia TeluguNews

Recommended Video

Hyderabad Metro Launch : Modi Flags Off Rail Service, Takes Ride Watch

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మధ్యాహ్నం గం.1.25 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు.

మోడీ వచ్చే వరకు లాబీల్లో కూర్చొని అందరూ ముచ్చటించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం గం.1.10 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవాలి. కానీ పావుగంట ఆలస్యం అయింది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటిది: హైదరాబాద్ మెట్రో కోసం మెగా ఫ్యామిలీ హీరో వెయిటింగ్తెలుగు రాష్ట్రాల్లో మొదటిది: హైదరాబాద్ మెట్రో కోసం మెగా ఫ్యామిలీ హీరో వెయిటింగ్

సోదర సోదరీమణులారా అంటూ తెలుగులో ఇలా

సోదర సోదరీమణులారా అంటూ తెలుగులో ఇలా

ప్రధాని మోడీ తొలుత ఎయిర్ పోర్టు పార్కింగ్ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆయనని కార్యకర్తలు సన్మానించారు. ఈ సభలో మోడీ తొలుత తెలుగులో మాట్లాడారు. సోదర, సోదరీమణులారా అంటూ ప్రసంగం ప్రారంభించారు. 'హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ విమోచనంలో అమరులైన వారికి జోహార్లు. ఇక్కడకు వస్తే సర్దార్ పటేల్ గుర్తుకు వస్తారు. హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరం. తెలంగాణ ప్రజలకు నా అభినందనలు. బీజేపీ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంది. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అభినందనలు' అని తెలుగులో చెప్పారు.

హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది

హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది

మోడీ ఇంకా మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. ప్రపంచ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వచ్చారన్నారు. హైదరాబాద్ వస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకు వస్తారని చెప్పారు.

ఏపీ, తెలంగాణల్లో సేవ చేసే అవకాశం రాలేదు

ఏపీ, తెలంగాణల్లో సేవ చేసే అవకాశం రాలేదు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో బీజేపీకి సేవ చేసే అవకాశం రాలేదని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని తెలిపారు.

మియాపూర్‌లో కేటీఆర్ స్వాగతం

మియాపూర్‌లో కేటీఆర్ స్వాగతం

బీజేపీ కార్యకర్తల సమావేశం అనంతరం ప్రధాని మోడీ మియాపూర్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు స్వాగతం పలికారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఆయన ప్రారంభించేందుకు మియాపూర్ వచ్చారు.

ఇవాంకాతో కలిసి వేదికపై కేటీఆర్: రామ్ చరణ్, సానియాల ప్రసంగంఇవాంకాతో కలిసి వేదికపై కేటీఆర్: రామ్ చరణ్, సానియాల ప్రసంగం

English summary
PM Narendra Modi reached Hyderabad on Tuesday afternoon. Governor Narasimhan and Telangana CM KCR welcomed PM at Begumpet Airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X