హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

థాంక్యూ పీఎం సర్: ఆదేశంలోని ముస్లిం మహిళను కాపాడిన ప్రధాని మోడీ...ఏంటా కథ..?

|
Google Oneindia TeluguNews

సోమాలియాలో బంధీగా ఉన్న హైదరాబాదుకు చెందిన ఓ ముస్లిం మహిళను సురక్షితంగా భారత్‌కు రప్పించేందుకు ప్రధాని మోడీ స్వయంగా చొరవ చూపారు. సోమాలియాలో తన అత్తగారింట్లో చిత్రహింసలకు గురవుతూ కాలం వెల్లదీస్తున్న అఫ్రీన్ బేగం అనే మహిళను వారి బంధీ నుంచి విడిపించడంలో ప్రధాని మోడీ చొరవ చూపారు. దీంతో తన ముగ్గురు కూతుళ్లతో సహా అఫ్రీన్ బేగం ఏప్రిల్ 2వ తేదీన ముంబై విమానాశ్రయంకు చేరుకోనున్నారు.

మోడీ రాహుల్‌గాంధీల కంటే ప్రధానిగా అన్ని అర్హతలు ఆయనకే ఉన్నాయి: ఓవైసీమోడీ రాహుల్‌గాంధీల కంటే ప్రధానిగా అన్ని అర్హతలు ఆయనకే ఉన్నాయి: ఓవైసీ

సోమాలియాను వదిలి వెళ్లేందుకు అడ్డుగా చట్టాలు

సోమాలియాను వదిలి వెళ్లేందుకు అడ్డుగా చట్టాలు

సోమాలియాలో భారత దౌతక్యార్యాలయం లేదు. అయితే నైరోబీలోని భారత హైకమిషన్‌కు చెందిన అధికారులు సోమాలియా అధికారులతో మాట్లాడి అఫ్రీన్ విడుదలకు కృషి చేశారు. సోమాలియా చట్టం ప్రకారం తండ్రి అనుమతి లేకుండా పిల్లలను తీసుకుని తల్లి దేశం విడిచి మరో దేశం వెళ్లరాదు. ఇక్కడే ప్రధాని మోడీ చొరవ తీసుకున్నారు. సోమాలియా అధికారులతో స్వయంగా మోడీ మాట్లాడారు. వెంటనే అఫ్రీన్‌ బేగం‌ను తన ముగ్గురు పిల్లలను భారత్‌కు సురక్షితంగా చేర్చాలని కోరారు. అఫ్రీన్ బేగం తల్లిదండ్రులు హైదరాబాదులో బష్రత్ నగర్‌లో నివాసముంటున్నారు.

కథ మొదలైంది ఇలా...

కథ మొదలైంది ఇలా...

హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఉద్యోగిగా ఉన్న మొహ్మద్ హుస్సేన్ అనే వ్యక్తిని 2013లో అఫ్రీన్ వివాహం చేసుకుంది. స్వతహాగా హుస్సేన్‌ కెనడా పాస్‌పోర్టు కలిగి ఉన్నాడు. అతని కుటుంబం మాత్రం సోమాలియాలో నివాసం ఉంటోంది. అక్కడే అఫ్రీన్ తన ముగ్గురు కుమార్తెలతో జీవనం సాగిస్తోంది. గతేడాది జూలై 4వ తేదీన భార్యాభర్తలు ఇద్దరూ సోమాలియాకు వెళ్లారు. ఆ తర్వాత ఎనిమిది నెలలకు హైదరాబాదులోని కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. అప్పుడప్పుడు వాట్సాప్ ద్వారా మాట్లాడేది.అది కూడా సోమాలియాలోని తన పొరిగింటి వారి ఫోన్ నుంచి మాట్లాడేది అఫ్రీన్.2019లో అఫ్రీన్ తండ్రి సయ్యద్ గఫూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు వెళ్లి జరిగినది తెలిపాడు. దీంతో నైరోబీలోని భారత హైకమిషన్‌ను వీరు సంప్రదించారు. ఇక వెంటనే సోమాలియాలో అఫ్రీన్ ఎక్కడ ఉందో వేట కొనసాగించి చివరిగా మొగదీషులో ఉన్నట్లు గుర్తించారు.

 మోడీకి ఎప్పటికీ రుణపడి ఉంటాం

మోడీకి ఎప్పటికీ రుణపడి ఉంటాం

సోమాలియాలో అఫ్రీన్ ఎక్కడుందో కనుక్కునేందుకు చాలా కష్టపడినట్లు భారత అధికారులు చెప్పారు. పైగా ఆమె ఉన్నది మొగదీషు ప్రాంతమని అక్కడ ఎక్కువగా బాంబు పేలుళ్లు జరుగుతాయని చెప్పారు. పైగా అఫ్రీన్ భర్త అక్కడ వివాదాస్పదుడిగా పేరుగాంచారని వెల్లడించారు. దీంతో ఆమె విడుదలకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్లు చట్టపరంగా పొందుపర్చాల్సి వచ్చిందని అధికారులు వివరించారు. అంతా అయ్యాక భారత్‌కు తరలించేందుకు సోమాలియా అధికారులు అడ్డు చెప్పారు. తన ముగ్గురు కూతుళ్లతో ఆమె దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. చివరిగా ప్రధాని అధికారులతో మాట్లాడిన తర్వాత ఆమె విడుదలకు మార్గం సుగమం అయ్యిందని అధికారులు తెలిపారు. తన కూతురు విడుదలకు సహకరించి ప్రత్యేక చొరవ చూపిన ప్రధాని మోడీకి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు అఫ్రీన్ తల్లిదండ్రులు.

English summary
Prime Minister Narendra Modi's personal intervention has led to the rescue of an Indian Muslim woman who had been held captive and tortured in Somalia by her in-laws since July 2018. The 31-year-old woman, Afreen Begum, was rescued from her captivity at Mogadishu in Somalia on March 28. She and her three daughters will land at the Mumbai airport on April 2.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X