హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని మోడీ సహా ప్రముఖుల రాక: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖుల హైదరాబాద్ పర్యటన సందర్భంగా నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కేంద్రమంత్రులు, జాతీయస్థాయిలో ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘనటలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జులై 1 నుంచి 4 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.కమిషనరేట్‌ పరిధిలో ఆంక్షలు, నిషేదాజ్ఞలు విధించారు. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ చుట్టుపక్కల 5 కి.మీ వరకు డ్రోన్లు, పారాగైడర్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వంటివి ఎగరడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర స్పష్టం చేశారు.

PM Modi visit: enforcement of section 144 from 1st to 4th july under cyberabad commissionerate.

గురువారం ఉదయం 6 గంటల నుంచి జులై 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు. అలాగే జులై 1 నుంచి 4 వరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జులై 1 నుంచి 4 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడొద్దని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించారు.

బీజేపీ జాతీయ కార్యకర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో ఇప్పటికే బీజేపీ స్వాగత తోరణాలు వెలిశాయి. మోడీ సభకు 10 లక్షల మంది హాజరవుతారని రాష్ట్ర పార్టీ నేతలు చెబుతున్నారు.

కాగా, ఇటీవల సైన్యంలో నియామకాలకు తీసుకొచ్చిన అగ్నిపథ్‌​కు వ్యతిరేకంగా సికింద్రాబాద్​లో అల్లర్లు చేలరేగడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రధాని రాక సందర్భంగా కాంగ్రెస్ ఆందోళనలకు దిగే అవకాశముండటంతో ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే హెచ్​ఐసీసీ ప్రాంగణాన్ని పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. గురువారం నుంచి పూర్తిస్థాయిలో ఎస్పీజీ అధీనంలోకి తీసుకుంటుందని వెల్లడించారు.

English summary
PM Modi visit: enforcement of section 144 from 1st to 4th july under cyberabad commissionerate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X