హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సేఫ్టీ ట్విస్ట్, మెట్రోపై నీలినీడలు?: ప్రధాని మోడీ రాకుంటే ఏం చేస్తారంటే

మెట్రో రైలు ప్రారంభం గతంలో రెండుసార్లు వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయా? అంటే అవునని ప్రచారం సాగుతోంది. సాంకేతిక అవరోధాలు మెట్రోను వెంటాడుతున్నాయని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Hyderabad Metro New Twist | Oneindia Telugu

హైదరాబాద్: మెట్రో రైలు ప్రారంభం గతంలో రెండుసార్లు వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయా? అంటే అవునని ప్రచారం సాగుతోంది. సాంకేతిక అవరోధాలు మెట్రోను వెంటాడుతున్నాయని అంటున్నారు.

మెట్టుగూడ నుంచి ఎస్సార్ నగర్ వరకు మార్గానికి కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ నుంచి అనుమతి రాలేదని, ప్రారంభోత్సవంపై ప్రధాని మోడీ నుంచి ఇంకా హామీ రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.

<br>మోడీ చేతుల మీదుగా మెట్రో సస్పెన్స్: అమీర్‌పేట స్టేషన్ అదుర్స్, విమానస్థాయి వసతులు ఇవీ..
మోడీ చేతుల మీదుగా మెట్రో సస్పెన్స్: అమీర్‌పేట స్టేషన్ అదుర్స్, విమానస్థాయి వసతులు ఇవీ..

 మెట్రోపై ప్రభుత్వం పట్టు

మెట్రోపై ప్రభుత్వం పట్టు

ఈ నెల 28వ తేదీన ఎలాగైనా మెట్రో రైలును ప్రారంభించాలనే పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందుకోసం యుద్ధ ప్రాతిపదిన పనులు చేస్తోంది. అయినా పైరెండు అంసాలు తేలడం లేదు. దీంతో సందిగ్ధత నెలకొందని చెబుతున్నారు.

సర్టిఫికేట్ కీలకం

సర్టిఫికేట్ కీలకం

ప్రయాణీకులకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకు వచ్చే ముందు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ నుంచి సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. నాగోల్ నుంచి మెట్టగూడ వరకు మియాపూర్ నుంచి ఎస్సార్ నగర్ వరకు అనుమతి వచ్చింది. మెట్టుగూడ నుంచి ఎస్సార్ నగర్ వరకు ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు.

 ఆరు నెలలు ట్రయల్ రన్ నిర్వహించాలి

ఆరు నెలలు ట్రయల్ రన్ నిర్వహించాలి

అయితే రైల్ సేఫ్టీ అనుమతి పొందాలంటే కనీసం ఆరు నెలల పాటు ట్రయల్ రన్ నిర్వహించాలని అంటున్నారు. మెట్రో రైలు 28న ప్రారంభం అవుతుందని, అందుకు 23వ తేదీకే అనుమతులు వస్తాయని అధికారులు ధీమాగా ఉన్నారట.

ప్రధాని మోడీ రాక కోసం

ప్రధాని మోడీ రాక కోసం

మెట్రో రైలు ప్రారంభోత్సవం గురించి ప్రధాని మోడీకి రెండు నెలల క్రితం ప్రభుత్వం లేఖ రాసింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఆయనను కలిసి ఆహ్వానించారు. అయితే పీఎంవో నుంచి ఇప్పటి వరకు సమాధానం రాలేదు.

 మియాపూర్ రాకపోతారా

మియాపూర్ రాకపోతారా

హైటెక్ సిటీ కార్యక్రమం కోసం వస్తున్న ప్రధాని మియాపూర్ మెట్రోకు రాకపోతారా అని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకో హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. ప్రధాని రాకుంటే హెచ్ఐసీసీ నుంచే రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభింప చేయాలనే యోచనలో ఉన్నారు.

English summary
The Prime Minister’s Office was still to confirm that Prime Minister Narendra Modi would inaugurate the Hyderabad Metro Rail project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X