వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదోన్నతికి పనికి రానంటే చెప్పండి.. ఉద్యోగం వదిలేస్తానన్న పోలీస్ అకాడమి డైరెక్టర్ వీకే సింగ్

|
Google Oneindia TeluguNews

పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీ.కే సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఏకంగా ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు వీ.కే సింగ్. పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పని చేస్తున్న వీ.కే సింగ్ గతంలో పోలీస్ అకాడమీ వల్ల పెద్దగా ఉపయోగం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ అకాడమీ కోసం చేస్తున్న ఖర్చు వృధా అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక తాజాగా తాను పదోన్నతికి పనికిరానా? అంటూ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు తెలంగాణ ఐపీఎస్ ఫైర్ బ్రాండ్ వీ.కే సింగ్.

warangal murders mystery : సైకిల్ సవారీనే సంజయ్ ను పట్టించింది .. హంతకుడి ఫోన్ లో షాకింగ్warangal murders mystery : సైకిల్ సవారీనే సంజయ్ ను పట్టించింది .. హంతకుడి ఫోన్ లో షాకింగ్

మరోసారి వివాదంలో వీ.కే సింగ్

మరోసారి వివాదంలో వీ.కే సింగ్

జైళ్ల శాఖ డీజీ గా ఉన్నప్పుడు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీ.కే సింగ్ ను ఆయన వ్యాఖ్యల వల్లే, ఆయన తీరు వల్లే ప్రభుత్వం ఆయనను ప్రింటింగ్ విభాగానికి బదిలీ చేసినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది.ఇక ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రం డైరెక్టర్ గా ఆయనను నియమించింది ప్రభుత్వం. పోలీస్ శిక్షణ కేంద్రం డైరెక్టర్ గా కూడా వీ.కే సింగ్ పోలీస్ అకాడమీపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అకాడమీ వల్ల పెద్దగా ఉపయోగం లేదని,నేషనల్ పోలీస్ అకాడమీ కూడా అదే పరిస్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యలు చేశారు.

 తనకు పదోన్నతి ఎందుకు ఇవ్వటం లేదంటూ ప్రభుత్వానికి లేఖ రాసిన ఐపీఎస్

తనకు పదోన్నతి ఎందుకు ఇవ్వటం లేదంటూ ప్రభుత్వానికి లేఖ రాసిన ఐపీఎస్

ఇక పోలీసులు ప్రదర్శన సరిగా లేదని ఆయన విమర్శలు గుప్పించారు. జైల్లో ఉన్న ఖైదీలు 90% పేద వాళ్ళని చెప్పిన వీకేసింగ్ గతంలో మీడియా పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక మీడియా ఛానల్ పైన కేసు పెట్టారు. ఇక తాజాగా తన పదోన్నతి గురించి ప్రభుత్వానికి లేఖ రాశారు వీ.కే సింగ్. అదనపు డీజీగా ఉన్న తనకు నిబంధనల ప్రకారం డీజీగా ఎందుకు పదోన్నతి ఇవ్వడం లేదంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తన లేఖ ద్వారా నిలదీశారు వీ.కే సింగ్.1987 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన తనకు 33 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత కూడా పదోన్నతి కల్పించకపోవడంపై ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం తన పట్ల నిర్లక్ష్యం చూపుతుందన్న వీ. కే సింగ్

ప్రభుత్వం తన పట్ల నిర్లక్ష్యం చూపుతుందన్న వీ. కే సింగ్

తాను డీజీగా ఎంపానెల్ అయ్యానని,1986 బ్యాచ్ ఐపిఎస్ అధికారులు మూడేళ్ల కిందట పదోన్నతి పొందారని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. సరైన ఖాళీలు లేకుండానే 1989 బ్యాచ్ ఐఏఎస్ లకు కూడా పదోన్నతులు వచ్చాయని, ఏపీ తో సహా ఇతర రాష్ట్రాల్లో 1989 బ్యాచ్ ఐఏఎస్ లు కూడా పదోన్నతులు పొందారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం తన పట్ల చూపుతున్న నిర్లక్ష్యం కారణంగా తాను పని చేయలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు.

పదోన్నతికి పనికిరాంటే ఉద్యోగం వదిలేస్తా అన్న పోలీస్ అకాడమీ డైరెక్టర్

పదోన్నతికి పనికిరాంటే ఉద్యోగం వదిలేస్తా అన్న పోలీస్ అకాడమీ డైరెక్టర్

తాను పదోన్నతి పనికిరాను అని ప్రభుత్వం భావిస్తే ఈ ఉద్యోగాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీకే సింగ్ లేఖ రాశారు. ఇక ఈ లేఖ ప్రతిని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుకు కూడా పంపించారు వీ.కే సింగ్. ప్రస్తుతం వీ.కే సింగ్ ప్రభుత్వానికి రాసిన లేఖ ఐపీఎస్ అధికారులలో చర్చనీయాంశంగా మారింది.మరి ఈ లేఖపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.

Recommended Video

Akkineni Nagarjuna, Rajamouli, Trivikram Giving Grossery Kits To Film Workres

English summary
Director of Police Academy VK Singh once again made sensational comments. This time, the government was opposed. Telangana IPS fire brand VK Singh wrote to the government saying he was ready to quit the job if the government felt he was not promoted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X