కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి అరెస్ట్....

|
Google Oneindia TeluguNews

కేంద్ర హోంశాఖ సహయా మంత్రి,సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా కిషన్ రెడ్డిని ఫోన్లో బెదిరిస్తున్న వ్యక్తి, కడప జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్‌గా గుర్తించారు. బెదిరింపు కాల్స్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం ఇస్మాయిల్‌‌ను అరెస్ట్ చేశారు. కాగా ఇస్మాయిల్ ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వార బెదిరింపు కాల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Police arrested a man who is making threatening calls to Kishan Reddy

కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడ ఇస్మాయిల్ బెదిరించాడు. దీంతో కిషన్ రెడ్డి పోలీసులకు పిర్యాధు చేశాడు. ఈనేపథ్యంలోనే పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులకు పట్టుబడ్డ ఇస్మాయిల్ కువైట్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పని చేసి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కడప జిల్లాలో నివసిస్తున్నట్టుగా సమాచారం .

మరోవైపు కేంద్ర మంత్రి అయిన తర్వాత కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ రావడంతో సీరియస్‌గా తీసుకున్న పోలీసులు స్కెచ్ వేసి పట్టుకున్నట్టు సమచారం. అరెస్ట్ చేసిన అనంతరం ఇస్మాయిల్‌ను రిమాండ్‌కు పంపినట్టుగా కూడ తెలుస్తోంది.

English summary
Police have finally arrested a man who is making threatening calls to Union Home Minister and Secunderabad Parliament Member Kishan Reddy. For the past few years,Sheikh Ismail of Kadapa district threatening Kishan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X